Telangana Corona Update: తెలంగాణలో పెరిగిన కరోనా కేసుల సంఖ్య.. 24 గంట‌ల్లో న‌మోదైన మ‌ర‌ణాలు ఎన్నంటే..?

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా....

Telangana Corona Update: తెలంగాణలో పెరిగిన కరోనా కేసుల సంఖ్య.. 24 గంట‌ల్లో న‌మోదైన మ‌ర‌ణాలు ఎన్నంటే..?

Updated on: Jan 20, 2021 | 9:45 AM

Telangana Corona Update: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 267 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక నిన్న ఒక్కరోజు 351 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,92,395 మంది కరోనా పడ్డారు. వీరిలో 2,86,893 మంది కరోనాను జయించారు.

క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణాలు ఎన్ని సంభ‌వించాయంటే..?

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,583 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,919 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో 2,270 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతం ఉండగా, రికవరీ రేటు 98.11 శాతంగా ఉంది. ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే తాజాగా నమోదైన‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 55 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత స్థానాల్లో క‌రీంన‌గ‌ర్ 20, మేడ్చల్ మల్కాజిగిరి 17 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

 

 

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us