Telangana Ministers: ఉగాది తర్వాత వరి వార్‌.. రైతుల ఉద్యమం ముందు కేంద్రం తల వంచాల్సిందేః మంత్రి నిరంజన్ రెడ్డి

|

Mar 26, 2022 | 11:42 AM

ఉగాది తర్వాత వరి వార్‌ ఉధృతం చేస్తామన్నారు తెలంగాణ వ్యవసాయ శాక మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ రైతుల ఉద్యమం ముందు కేంద్రం తల వంచాల్సిందేనన్నారు.

Telangana Ministers: ఉగాది తర్వాత వరి వార్‌.. రైతుల ఉద్యమం ముందు కేంద్రం తల వంచాల్సిందేః మంత్రి నిరంజన్ రెడ్డి
Telangana Ministers
Follow us on

Telangana Ministers Press Meet: ఉగాది తర్వాత వరి వార్‌ ఉధృతం చేస్తామన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singi Reddy Niranjan Reddy). తెలంగాణ రైతుల(Farmers) ఉద్యమం ముందు కేంద్రం తల వంచాల్సిందేనన్నారు. తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పాచికలు తెలంగాణలో పారవన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి స్పష్టత లేదన్నారు. తెలంగాణ ఎర్పడినప్పటి నుంచి, ఇప్పటిదాకా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నుంచి ఎలాంటి సహకారం లేదన్నారు.

తెలంగాణ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తోందని ఫైర్‌ అయ్యారు మంత్రి సింగిరెడ్డి. తెలంగాణ రైతులు బీజేపీ నేతల మాటలకు గోల్‌మాల్‌ కారన్నారు. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు, తెలంగాణ రైతులకే ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ రైతుల సమస్యలపై ఎప్పుడైనా మాట్లాడారా అని బీజేపీ నేతలను నిలదీశారు నిరంజన్ రెడ్డి. పంటలు కొనే బాధ్యత కేంద్రానిదే అని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం లేదన్నారు. బీజేపీ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతోందని మండిపడ్డారు.

తాము వరిపంట వేయొద్దని ముందే చెప్పాని తెలిపారు. బీజేపీ నేతలనే రైతులతో వరిపంట వేయించారని మండిపడ్డారు. కేంద్రంతో కొనిపించే బాధ్యత నాదని బండిసంజయ్ చెప్పారని గుర్తు చేశారు. యాసంగిలో పంట కొనేవరకు పోరాటం ఆగదన్నారు. ప్రతి గింజ కొంటామని చెబుతూనే రారైస్ కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై బీజేపీ నేతలకు అక్కసు ఎందుకని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణను అవమానించినవారు చరిత్రలో కలిసిపోయారని పేర్కొన్నారు. కేంద్రం లేకీ మనస్తత్వంతో మాట్లాడుతోందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చేవరకు కేంద్రమంత్రిగా ఉంటారా? అని వ్యాఖ్యానించారు. వడ్లు కొనాలని కిషన్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇన్నిసార్లు ఢిల్లీకి మేం వెళ్తే మాతో కలిసి కిషన్ రెడ్డి ఎందుకు పీయూష్ గోయల్ ను కలవలేదని నిలదీశారు. ఉగాది తర్వాత ఉద్యమం ఉధృతం చేస్తామని నిరంజన్ రెడ్డి ప్రకటించారు.

ఏప్రిల్ 1 వరకు ప్రతి స్థాయిలో ధాన్యం కొనుగోలుపై సామూహిక తీర్మానాలు చేసి ప్రధాని మోడీకి పంపాలని రాష్ట్రమంత్రులు కోరారు. ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టుగా చెప్పారు. కేసీఆర్‌ ఉన్నంతకాలంగా తెలంగాణ రైతులకు రక్షణ కవచం ఉన్నట్టేనని అన్నారు. తెలంగాణ రైతులకు కేంద్రం క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.