Minister Srinivas Goud: జస్ట్ సౌండ్ వచ్చే తుపాకీ మాత్రమే.. కాల్పుల వీడియోపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందన ఇదే..

|

Aug 13, 2022 | 7:51 PM

Minister Srinivas Goud Firing: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాల్లోకి కాల్పులు జరపడం పెద్ద చర్చకు దారి తీస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ మైదానం నుంచి క్లాక్‌టవర్‌ వరకు శనివారం అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఫ్రీడం ఫర్‌ ర్యాలీ నిర్వహించారు

Minister Srinivas Goud: జస్ట్ సౌండ్ వచ్చే తుపాకీ మాత్రమే.. కాల్పుల వీడియోపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందన ఇదే..
Minister Srinivas Goud Firi
Follow us on

మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఫ్రీడం ఫర్‌ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాల్లోకి కాల్పులు జరపడం పెద్ద చర్చకు దారి తీస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ మైదానం నుంచి క్లాక్‌టవర్‌ వరకు శనివారం అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఫ్రీడం ఫర్‌ ర్యాలీ నిర్వహించారు. అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఫ్రీడం ఫర్‌ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక నేతలు, అధికారులు స్వతంత్ర పోరాటంపై ప్రసంగించారు. అనంతరం.. ర్యాలీ ప్రారంభించే సమయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పక్కనే ఉన్న కానిస్టేబుల్‌ చేతిలోని తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది. పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరపడం ఏంటీ అంటున్న ప్రశ్నిస్తున్నారు .

వివాదం రాజుకోగానే.. మంత్రి తనకు తానుగా వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే టీవీ9కి ఇచ్చిన ఫోన్ ఆడియోలో.. అవి రబ్బరు బుల్లెట్లు అని, నిజమైనవి కావని, నిజమైనవీ అని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు.

మంత్రి రబ్బరు బులెట్లయినా కాల్చొచ్చా.. పక్కన ఉన్న పోలీసుల నుంచి తుపాకీ తీసుకోవచ్చా అన్న ప్రశ్నలకు జిల్లా ఎస్పీ మరోలా ఆన్సర్ ఇచ్చారు. వాడింది ఇన్‌సాస్‌గన్‌ అన్నారాయన. అంటే, అందులో రబ్బరు గానీ, ఒరిజినిల్‌గానీ అస్సలు బులెట్సే ఉండవన్నారు. జస్ట్ సౌండ్ కోసం చేసిన అరేంజ్‌మెంట్‌గా చెప్పారు. క్రీడామంత్రితో ఫైరింగ్ జరిపించడం ఒక ఆనవాయితీ, దాన్నే పాటించామన్నారు ఎస్పీ వెంకటేశ్వర్లు.

ఎస్పీ వెర్షన్ ఇలా వచ్చిందో లేదో.. అటు మంత్రి కూడా మాట మార్చారు. అప్పటి వరకూ రబ్బర్ బులెట్లంటూ సవాల్ చేసిన శ్రీనివాస్‌ గౌడ్‌ తాను పేల్చింది జస్ట్ సౌండ్ వచ్చే తుపాకీ మాత్రమేనంటూ వెర్షన్ 2 వినిపించారు.

ఎస్పీ నుంచి, మంత్రి నుంచి ఈ క్లారిటీ రాగానే సోషల్ మీడియాలో మరో ప్రశ్న మొదలైంది. రబ్బరు బులెట్లో, సౌండ్‌వచ్చే పెలెట్లో గానీ వివాదం రాజకీయంగా ముదరకుండా జాగ్రత్తగా క్లారిటీ ఇస్తూ వచ్చారు శ్రీనివాస్‌గౌడ్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం