Minister KTR Warangal Tour: ఈనెల 20వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు వరంగల్ పర్యటన ఖరారైంది.. వివిధ అభివృద్ధి కార్యక్రమాల లో పాల్గొన్న అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. హనుమకొండ లోని హాయగ్రీవచారీ గ్రౌండ్‌లో సభ నిర్వహణ కోసం స్థలాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు, జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనకు, వారం రోజుల ముందు మంత్రి కేటీఆర్ వస్తుండటంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 20వ తేదీన ఒక రోజు మొత్తం వరంగల్ లో పర్యటించనున్నారు.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.. అనంతరం హనుమకొండ జిల్లా స్థాయి బహిరంగ సభ ఉంటుంది.. దీంతో పెద్ద ఎత్తున జన సమీకరణపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాయి. సభ నిర్వహణ కోసం ఇప్పటికే రెండు ప్రాంతాలను పరిశీలించారు.. మొదట LB కళాశాల మైదానాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు జిల్లాకు చెందిన MLAలు, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు..
ఆదివారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, ఇతర MLAలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాయగ్రీవచారీ మైదానాన్ని పరిశీలించారు.. సభ నిర్వహణ కు హాయగ్రీవచారీ గ్రౌండ్ అనువుగా ఉంటుందని భావించారు.. సభా స్థలాన్ని పరిలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్… హైదరాబాద్ తరువాత వరంగల్ నగరం పై సీఎం ప్రత్యేక శ్రద్ద పెట్టి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఎం అందులో భాగంగానే ఈ నెల 20వ తేదీన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారని తెలిపారు.. అభివృద్ధిపై జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు… హాయగ్రీవ చారీ గ్రౌండ్ లో 20వ తేదీ సాయంత్రం 4గంటలకు బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు..
Read Also… Hyderabad: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. నేటి నుంచే ఈ- ఆటో సేవలు.. ఎలా బుక్ చేసుకోవాలంటే..