Minister Harish Rao: వైసీపీ-టీడీపీలు ఏపీని ఆగం చేస్తున్నాయి.. మా జోలికి వస్తే మీకు మంచిది కాదంటూ హరీష్ రావు వార్నింగ్..

| Edited By: Janardhan Veluru

Apr 12, 2023 | 5:26 PM

ఆంధ్రా మంత్రులు అనవసరంగా మా జోలికి రాకండి అంటూ హెచ్చరించారు మంత్రి హరీష్ రావు. మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే మీకే మంచిందంటూ హితవు పలికారు.

మరోసారి ఏపీ మంత్రుల కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. తాను ఏమన్నానని ఆంధ్రా మంత్రులు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మీ దగ్గర ఏమున్నది అని అంటున్నారు. మా దగ్గర ఉన్నాయి చెప్పమంటే దునియా చెబుతామని విమర్శించారు. తమ దగ్గర 56 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది.. రైతు బీమా, రైతు బంధు ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం‌ను నిర్మించామన్నారు. మీ దగ్గర ఏమున్నాయంటూ ఏపీ మంత్రులను ఎదురు ప్రశ్నించారు హరీష్ రావు. ఆనాడు ప్రత్యేక హోదా కావాలని అన్నారు.. ఇప్పుడేమో అడగరు. ప్రత్యేక హోదా కేంద్రం ఎగబెట్టిన ఏం అడగరు.. విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరు. అధికారంలా ఉన్న వాళ్ళు అడగరు.. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరు. విశాఖ ఉక్కును తుక్కుకి అమ్మిన ఎవ్వరు అడగరు. ప్రజలను గాలికి వదిలేశారు.. మీ ప్రయోజనాలు చూసుకుంటున్నారు మంత్రి హరీష్ రావు.

వైసీపీ, ప్రతి పక్ష పార్టీ తెలుగు దేశం పార్టీలు కలిసి ఏపీని ఆగం చేశాయని మండిపడ్డారు. ఆంధ్రా మంత్రులు అనవసరంగా మా జోలికి రాకండి అంటూ హెచ్చరించారు. మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే మీకే మంచిందంటూ హితవు పలికారు. ఢిల్లీలో ఉన్నోళ్లు మనల్ని నూకలు బుక్కమని ఎగతాళి చేశారు. తెలంగాణ ప్రజలంతా కలిసి ఢిల్లీల ఉన్నోడికి మనం నూకలు బుక్కీయ్యాలన్నారు హరీశ్ రావు. త్యాగాల పునాదులు మీద ఏర్పడిన పార్టీ తమ పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. తెలంగాణను తాకట్టు పెట్టె పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం