Covid Vaccination: తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ కీలక నిర్ణయం.. వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్య భారీగా పెంపు..

|

Jan 18, 2021 | 8:44 AM

Covid Vaccination: తొలి రోజు వ్యాక్సిన్‌ ప్రక్రియ విజయంతం అవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం వైద్యఆరోగ్య శాఖ..

Covid Vaccination: తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ కీలక నిర్ణయం.. వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్య భారీగా పెంపు..
Follow us on

Covid Vaccination: తొలి రోజు వ్యాక్సిన్‌ ప్రక్రియ విజయంతం అవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం వైద్యఆరోగ్య శాఖ నిర్వహించిన సమీక్షలో.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. అలాగే టీకా లబ్ధిదారుల సంఖ్యనూ పెంచాలని నిర్ణయించారు. తొలి రోజు 139 కేంద్రాల్లో టీకా కార్యక్రమం చేపట్టగా.. సోమవారం నాడు అదనంగా 184 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని వైద్య అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సోమవారం నాడు రాష్ట్రం వ్యాప్తంగా 323 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక తొలిరోజు ప్రతి టీకా కేంద్రంలో 30 మందికి మాత్రమే టీకా ఇవ్వగా.. ఇప్పుడు ఆ లబ్ధిదారుల సంఖ్యను 50కి పెంచారు.

అలా మొత్తంగా నేడు 323 కేంద్రాల్లో 16,150 మందికి టీకా ఇవ్వనున్నారు. ఆ మేరకు ఏర్పాట్లను కూడా అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు జిల్లాల అధికారులకు చేరాయి. శనివారం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేష్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి రోజు 139 కేంద్రాల్లో 3962 మందికి వ్యాక్సిన్ వేశారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారికలో ఎవరికీ ఎలాంటి దుష్ప్రభావాలు చూపకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు.

Also read:

ఏపీ: మూడో రోజు వ్యాక్సినేషన్‌కు రంగం సిద్దం.. రెండు రోజుల్లో ఎంత మంది వ్యాక్సిన్ వేయించుకున్నారంటే.!

Andhra Pradesh High Court: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో నేడు విచారణ.. ధర్మాసనం స్పందనపై తీవ్ర ఉత్కంఠ..