Telangana: సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్‎కు తగ్గిన గ్రాఫ్.. కోల్పోయిన మెజార్టీ ఎంతంటే..

అది బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. తెలంగాణ ఉద్యమ పోరాటానికి పురిటిగడ్డ. ఇక్కడ బీఆర్ఎస్ గెలవడం పక్క అనే నానుడి బలంగా ఉండేది. కానీ మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని పార్టీ పెద్దలు అంతర్మథనంలో పడ్డారు. వరుసగా గడచిన ఐదు పార్లమెంట్​ ఎన్నికల్లో గెలుపొంది మెదక్ లోక్​ సభ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్న బీఆర్ఎస్​.. ఈ సారి ఎన్నికల్లో సైతం గెలుపొంది డబుల్​హ్యాట్రిక్​ కొట్టి తమ కంచుకోటను ఎవరూ బద్ధలు కొట్టలేరని చాటాలని ఆశించింది. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది.

Telangana: సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్‎కు తగ్గిన గ్రాఫ్.. కోల్పోయిన మెజార్టీ ఎంతంటే..
Brs
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 08, 2024 | 11:15 AM

అది బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. తెలంగాణ ఉద్యమ పోరాటానికి పురిటిగడ్డ. ఇక్కడ బీఆర్ఎస్ గెలవడం పక్క అనే నానుడి బలంగా ఉండేది. కానీ మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని పార్టీ పెద్దలు అంతర్మథనంలో పడ్డారు. వరుసగా గడచిన ఐదు పార్లమెంట్​ ఎన్నికల్లో గెలుపొంది మెదక్ లోక్​ సభ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్న బీఆర్ఎస్​.. ఈ సారి ఎన్నికల్లో సైతం గెలుపొంది డబుల్​హ్యాట్రిక్​ కొట్టి తమ కంచుకోటను ఎవరూ బద్ధలు కొట్టలేరని చాటాలని ఆశించింది. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. మెదక్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొన్ని చోట్ల సరైన మెజార్టీ రాకపోవడంతో మెదక్ ఎంపీ సీట్‎ను కోల్పోయింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ లోక్​ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో, ఆరుచోట్ల బీఆర్ఎస్​ గెలించింది. ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండడం, మొత్తం లోక్​ సభ నియోజకవర్గ వ్యాప్తంగా 2.48 లక్షల మెజార్టీ లభించడంతో గెలుపు తమదే అన్న ధీమాలో గులాబీ పార్టీ ఉంది. కానీ అవి ఏవీ పనిచేయలేదు.

గులాబీ కంచుకోటగా పేరున్న మెదక్ లోక్​సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ​పార్టీకి ఊహించని షాక్​ తగిలింది. వరుసగా ఆరోసారి లోక్​సభ ఎన్నికల్లో గెలుపొంది డబుల్ ​హ్యాట్రిక్​ కొట్టాలని ఆశించిన ఆ పార్టీకి ఓటర్లు ఝలక్​ ఇచ్చారు. రాష్ట్రంలో మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా మెదక్​లో మాత్రం ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాలో ఆ పార్టీ హైకమాండ్​ ఉండగా, ఓటమి చవిచూడడమే కాక మూడో స్థానానికి పరిమితమైంది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీని ఆదరించి ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలను గెలిపించిన ఓటర్లు లోక్​సభ ఎన్నికల్లో మాత్రం వ్యతిరేక తీర్పునిచ్చారు. 2023 నవంబర్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మెదక్ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు చోట్ల బీఆర్ఎస్​ అభ్యర్థులు గెలిచారు. సంగారెడ్డి, పటాన్​చెరు, నర్సాపూర్​, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్​ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్​ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి బీఆర్ఎస్​కు 6,68,955 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి 4,20,881, బీజేపీకి 2,11,626 ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్​పై బీఆర్ఎస్​ 2,48,074 ఓట్ల మెజారిటీ సాధించింది. ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు రెండున్నర లక్షల ఓట్ల ఆధిక్యత లభించడంతో లోక్​ సభ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే అన్న ధీమాలో బీఆర్ఎస్​ ఉండగా.. ఆ పార్టీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని ఆదరించి కారు గుర్తు మీద నొక్కిన ఓటర్లు.. పార్లమెంట్​ ఎన్నికలకు వచ్చేసరికి కమలం పార్టీకి జై కొట్టి బీఆర్ఎస్​కు ఊహించని షాక్​ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు 6,68,955 ఓట్లు రాగా లోక్​ సభ ఎన్నికల్లో 3,95,250 ఓట్లు మాత్రమే వచ్చి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఊహించని విధంగా అప్పటి కంటే 2,73,705 ఓట్లు తగ్గాయి. అగ్రనేతల సెగ్మెంట్లలోనూ భారీగా ఓట్లు తగ్గాయి. బీఆర్ఎస్ గెలుపొందిన నియోజకవర్గాల్లోనూ భారీగా ఓట్లు తగ్గాయి. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ సెగ్మెంట్​లో అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు 26,252 ఓట్లు తగ్గగా, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహించే సిద్దిపేట సెగ్మెంట్​లో 40,013, సంగారెడ్డి సెగ్మెంట్​లో 55,238, పటాన్​చెరు సెగ్మెంట్​లో 50,806 , నర్సాపూర్​ సెగ్మెంట్​ లో 34,038 , మెదక్ నియోజకవర్గంలో 36,493, దుబ్బాక సెగ్మెంట్​లో 31,165 ఓట్లు తగ్గాయి. ఇలా ఎందుకు జరిగాయి అని బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచనలో పడ్డారట. దీనిపై అధినేత కేసీఆర్‎తో చర్చించి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు, పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!