Rythu Bima: రైతులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్.. పథకానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటంటే..

|

Apr 21, 2022 | 3:52 PM

Rythu Bima: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు ..

Rythu Bima: రైతులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్.. పథకానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటంటే..
Rythu Bima
Follow us on

Rythu Bima: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. అలాగే తెలంగాణ (Telangana) ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న స్కీమ్‌లలో రైతు బీమా కూడా ఒకటి. ఈ రైతు బీమా వల్ల రైతులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందుతుంది. రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద అర్హులైన రైతులందరూ కూడా ఈ పథకం పొందవచ్చు. ఈ పథకంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.24,254 కోట్లను కేటాయించింది.

తెలంగాణలో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులకు ఆగస్టు 15, 2018 నుండి 5 లక్షల భీమా కవరేజి లభిస్తుంది. 50 లక్షల మంది రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించనుంది. ఏ రైతు మరణంచిన తెలంగాణలో రైతులకు 5 లక్షల బీమా కవరేజ్ లభిస్తుందని దేశంలో మొట్టమొదటి అమలు అవుతుంది.

భీమా పొందటానికి రైతులకు ఒక రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక రైతు చనిపోయినట్లయితే మరణించిన 10 రోజులలోపు తన కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందుతాయి. ఇది ప్రమాదవశాత్తు భీమా కాదు, కానీ సహజ మరణం కూడా ఉంటుంది. రైతు బీమా కార్యక్రమం కింద రైతు మరణం సహజమా లేదా ప్రమాదవశాత్తు సంబంధం లేకుండా రైతుల కుటుంబాలకు బీమా మొత్తం లభిస్తుంది. ఇన్సూరెన్స్ రైతులకు బీమా పత్రాలను అందిస్తారు. ఈ లింక్‌ ద్వారా  రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పథకానికి ఉండాల్సిన అర్హతలు:

ఈ రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే రైతు వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉండాలి. వయసు ధృవీకరణ పత్రం, ఆధార్‌ను అందించాలి. అలానే గ్రామంలో ఉన్న భూములకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. రైతే స్వయంగా వెళ్లి నామినేషన్ ఇవ్వాలి. రైతులు భూమికి సంబంధించిన పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్‌ను తప్పక సబ్మిట్ చెయ్యాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. అలానే పర్మినెంట్ రెసిడెంట్ అయి ఉండాలి. అలాగే సొంత వ్యవసాయ భూమి కలిగి ఉండాలి.
కౌలుకి తీసుకుని పంట పండించే వారికి ఈ స్కీమ్ వర్తించదు.

ఇవి కూడా చదవండి:

EPFO: ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్‌ డబ్బుల విషయంలో కంపెనీ చుట్టు తిరుగుతున్నారా? ఆ పని మీరే చేసుకోవచ్చు.. ఎలాగంటే!

Cement Prices: గృహ నిర్మాణదారులకు షాక్.. భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు.. బస్తాకు ఎంతంటే..