
తెలంగాణలోని వాహనదారులకు గుడ్ న్యూస్. బైక్, కార్ రిజిస్ట్రేషన్లలో మరింత వేగం పుంజుకోనుంది. పేపర్ లెస్ ప్రక్రియను తెలంగాణ రవాణశాఖ శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ఫిజికల్ డాక్యుమెంట్లతో సంబంధం లేకుండా డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. వెహికల్ రిజిస్ట్రేషన్ల ప్రాసెసింగ్ జాప్యాలను తగ్గించడానికి, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను క్రమబద్దీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 13వ తేదీ నుంచి పేపర్ లైస్ డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. బైక్‌లు, కార్ల శాశ్వత రిజిస్ట్రేషన్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. సాంప్రదాయ ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించే విధానానికి స్వస్తి చెప్పి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు.
-గతంలో వెహికల్స్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి డీలర్లు ఫిజికల్ డాక్యుమెంట్లను స్పీడ్ పోస్ట్ లేదా కొరియల్ ద్వారా ఆర్‌టీఏ కార్యాలయానికి సమర్పించాల్సి వచ్చింది. ఫారం-20, ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్లను పోస్ట్ ద్వారా పంపాల్సి వచ్చేది. అయితే ఇక నుంచి ఆ అవసరం లేదు.
-డీలర్లు ఫారం-20, ఇతర డాక్యుమెంట్లను స్కాన్ చేసి ఆన్‌లైన్ ద్వారా వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మార్చి 13 నుంచి అన్ని తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలతో పాటు ఈ తేదీకి ముందు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలు కూడా ఈ పర్మినెంట్ రిజిస్ట్రేషన్‌కు అర్హత పొంది ఉంటాయి.
-అప్‌లోడ్ చేసే డాక్యుమెంట్లకు డీలర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నకిలీ డాక్యుమెంట్స్ సమర్పిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు
-డీలర్ల ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత రవాణాశాఖ అధికారులు పరిశీలించి రెండు రోజుల్లో దరఖాస్తుకు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. జాప్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటారు
-దరఖాస్తులను ప్రాసెస్ చేయడం లేదా సమీక్షించడం లేదా ఆమోదించడం లాంటివి అధికారులు చేయాలి
-ఇక డీలర్లు తమ లాగిన్స్‌లో ఏడు రోజుల కంటే ఎక్కువకాలం తమ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకూడదు
-ఒకవేళ డీలర్లు ఎక్కువరోజులు పెండింగ్‌లో ఉంచితే లాగిన్ వివరాలను సస్పెండ్ చేయడంతో పాటు క్షమశిక్షణా చర్యలు తీసుకుంటారు
-మార్చి 13 నుంచి ప్రారంభమయ్యే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఈ ఆన్‌లైన్ విధానం తప్పనిసరిగా పాటించాలి
-వీటికి సంబంధించి రవాణాశాఖ కమిషనర్ నోటిఫికేషన్ ఇవాళ జారీ చేశారు. మార్చి 13 నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు
-ఇకపై వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం వాహనదారులు ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది
-కొత్త ఆన్‌లైన్ విధానం వల్ల రవాణాశాఖ కార్యాలయాలపై ఒత్తిడి తగ్గుతుంది