సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. ఈ విషయం తెలిసి కూడా కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ శాస్వతంగా చూపుకోల్పోతున్నారు చాలా మంది. వీరందరినీ చైతన్య పరిచి.. ఆదుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఈ ఆలోచనల్లోంచి పుట్టిందే.. కంటి వెలుగు కార్యక్రమంగా చెబుతారు తెలంగాణ మంత్రులు.
ఈ రోజు ఖమ్మం వేదికగా.. కొత్త కలెక్టరేట్‌లో నలుగురు ముఖ్యమంత్రుల చేతుల మీదుగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం మొదలు కానుంది. మొత్తం నాలుగు కౌంటర్ల ద్వారా.. కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలను ఇవ్వనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వందరోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. స్పెషలిస్టు డాక్టర్లతో కూడిన 1,500 టీమ్‌లు ఈ ప్రొగ్రాంలో పాల్గొనబోతున్నాయి. రూ. 250 కోట్ల బడ్జెట్‌తో అరవై లక్షల కళ్ల జోళ్లు పంచడంతో పాటు.. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా రికమండ్ చేస్తారు. సంబంధిత ఆస్పత్రుల్లో వారికి శస్త్ర చికిత్సలు చేయిస్తారు. ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఆరోగ్యమంత్రి హరీష్ రావు.
చాలా మంది తమ చూపు తక్కువైందని తెలిసి కూడా ఆస్పత్రికి వెళ్లడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారనీ.. వీరి కోసమే సీఎం కేసీఆర్ నేరుగా గ్రామాలకు వెళ్లి అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి తిరిగి కంటి వెలుగు ప్రసాదించాలనే నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు మంత్రి హరీష్ రావు.
కన్నుల పండుగగా కంటి వెలుగు..!
ఈనెల 18న సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభం..
రండి కంటి వెలుగును విజయవంతం చేద్దాం.. నివారింపదగ్గ అంధత్వ రహిత తెలంగాణను సాకారం చేద్దాం..#KantiVelugu pic.twitter.com/u8x6kFiNVn
— Harish Rao Thanneeru (@trsharish) January 15, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..