సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడంపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని లవ్ హైదరబాద్ ముందు జన సైనికులకు, వీర మహిళలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినా కానీ… మనం ఇంకా నిజాం పరిపాలనలో ఉన్నట్లు గానే ఉందని జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం విమర్శించారు. గత ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు విమోచన దినోత్సవం ప్రభుత్వమే నిర్వహించాలని నొక్కి చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పరని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కొరకు 1200 మంది అమరవీరులు ఆత్మ బలిదానం చేసుకుంటే… తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే… ఈ రోజు తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించక పోవడం సిగ్గుచేటన్నారు.