Ramadan 2026: ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రంజాన్‌ మాసం మొత్తం గంటముందే ఇంటికెళ్లే ఛాన్స్!

నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభంకానుంది. ఈ నెల మొత్తం ముస్లిం సొదరులు ఉపవాసాలు చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ రంజాన్ మాసం మొత్తం ముస్లిం ఉద్యోగులు సాయంత్రం ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లిపోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

Ramadan 2026: ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రంజాన్‌ మాసం మొత్తం గంటముందే ఇంటికెళ్లే ఛాన్స్!
Telangana Ramadan Early Leave

Updated on: Feb 18, 2026 | 8:00 AM

ముస్లింలకు పవిత్రమైన రంజాన్ నెల నేటి నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ రంజాన్ మాసం కొనసాగనుంది. అయితే నెల రోజులు ముస్లింలు ఉపవాస దీక్షను పాటిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. ఈ ఉపవాసాల నేపథ్యంలో నెల మొత్తం ముస్లిం ఉద్యోగులకు పనిగంటల్లో మినహాయింపులు కల్పించింది. ఒక్క పొద్దులు ఉండే ముస్లిం ఉద్యోగులు ఈ రంజాన్ మాసంలో సాయంత్రం ఒక గంటల ముందుగానే ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లిపోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ఉద్యోగాల్లో పనిచేస్తున్న పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, టీచర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుకు పని వేళలల్లో మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ముస్లిం ఉద్యోగులు ఈ రంజాన్ మాసం మొత్తం తమ ఆఫీసులు, స్కూళ్ల నుంచి గంట ముందుగానే లాగౌట్ అయి ఇంటికి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. నేటి నుంచి రంజాన్ మాసం ముగిసే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us