Minister Puvvada Ajay: యాదాద్రిలో మంత్రి పువ్వాడపై తేనెటీగల దాడి.. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు!

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తేనెటీగల దాడి చేశాయి.

Minister Puvvada Ajay: యాదాద్రిలో మంత్రి పువ్వాడపై తేనెటీగల దాడి.. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు!
Puvvada Ajay

Updated on: Mar 28, 2022 | 5:44 PM

Honey bees attack on Ajay Puvvada: తెలంగాణ(Telangana) రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌(Puvvada Ajay Kumar)పై తేనెటీగల దాడి చేశాయి. యాదాద్రి(Yadadri) శ్రీలక్ష్మీనారసింహుడి ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సోమవారం జరిగిన మహాకుంభ సంప్రోక్షణలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువులో ఉన్న మంత్రి, వేద పండితులు, మంత్రి వ్యక్తిగత భద్రత సిబ్బందిపైన ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో మంత్రితో పాటు పలువురు వేద పండితులు, సిబ్బంది గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటీన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఉదయం 11:45 గంటల సమయంలో పూజా కార్యక్రమంలో నిమగ్నమైన మంత్రి పైకి ఒక్కసారిగా తేనెటీగలు దూసుకొచ్చాయి. తేనెటీగలు దాడి చేసినప్పటికీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భక్తిభావంతో మహాకుంభ సంప్రోక్షణ పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రాథమిక చికిత్స కొరకు పూజా క్రతువును ముగించుకొని హుటాహుటిన మంత్రి అజయ్ హైదరాబాద్ కు బయల్దేరివెళ్లారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Read Also…  Flash Point Live: విశాఖలో ఎంపీ MVV వెర్సస్ ఎస్పీ మధు.. స్థలం జగడం.. (వీడియో)