Telangana: బిగ్ అలర్ట్.. వారి నుంచి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వెనక్కి..! ప్రభుత్వం కీలక నిర్ణయం!
డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పొంది వాటిలో నివసించని ఫ్యామిలీ నుంచి ఇళ్లను ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. ఇచ్చిన నోటీసులపై స్పందించకపోతే జాబితాలోంచి వారి పేరును తొలగించింది. ఇంటిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోనుట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పొందిన లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం అందించిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లలో నివసించని లబ్దిదారులను నుంచి వాటిని తిరిగి తీసుకోవాలని నిర్ణయించింది. ఇలా ఇళ్లను ఖాళీగా ఉంచిన లబ్ధిదారులకు ఇప్పటికే ప్రభుత్వం రెండు సార్లు నోటీసులు పంపింది. ఇక మూడో సారి కూడా నోటీసులకు స్పందించకపోతే వారి పేర్లను జాబితా నుంచి తొలగించి ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకొనన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో గత రెండు నెలల క్రితం అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన సుమారు 19 వేల మంది మంది లబ్ధిదారులు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసించడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే లబ్ధిదారులందరూ తమకు కేటాయించిన ఇళ్లలో చేరాలని అధికారులు వారికి నోటీసులు పంపారు. కానీ లబ్ధిదారులు మాత్రం వాటిని పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో రీసెంట్‌గా అధికారులు మరోసారి వారిని నోటీసులు జారీ చేశారు. అయినా వారిని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మూడో సారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సారి స్పందించకపోతే వారి పేర్లను జాబితా నుంచి తొలగించి ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
అయితే గ్రేటర్ పరిధిలో నివసిస్తున్న పేదలకు నగర శివారులో నిర్మించిన 90 వేల ఇళ్లను 2023 ఆగస్ట్‌లో ప్రభుత్వం కేటాయించింది. అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేవంటూ దాదాపు 40 మంది లబ్ధిదారులు వాటిలో చేరలేదు. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లూరు, తూంకుంట, రాంపల్లి, వనస్థలిపురం, ప్రతాపసింగారం వంటి ప్రాంతాల్లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద అన్ని వసతులను ఏర్పాటు చేసింది. అయినా కూడా దాదాపు 30 శాతం మంది ఇంకా ఇళ్లలోకి చేరలేదని తాజాగా జరిగిన తనిఖీల ద్వారా ప్రభుత్వం గుర్తించింది.
అయితే వీరందికి ఇప్పటికే రెండు దఫాలుగా నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. మూడోసారి కూడా నోటీసులకు స్పందించకుండా ఇళ్లలోకి చేరకపోతే వారి నుంచి ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆలోచిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ధరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకొని కొత్త ధరఖాస్తు దారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
