Telangana: ఇదేందయ్యా బాబూ.. ప్రభుత్వ డాక్టర్ల స్థానంలో ప్రైవేట్ వైద్యులు.. అసలు గుట్టు బయటపడింది..

ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులకు వెళ్లకండా వారి స్థానంలో ప్రైవేట్ డాక్టర్లను పంపిస్తున్నారు. తెలంగాణలో జోగిపేట ఏరియా ఆప్పత్రిలో ఈ గుట్టు బయటపడింది. దీంతో వైద్యశాఖ మంత్రి స్పందించి చర్యలు తీసుకున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నవారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.

Telangana: ఇదేందయ్యా బాబూ.. ప్రభుత్వ డాక్టర్ల స్థానంలో ప్రైవేట్ వైద్యులు.. అసలు గుట్టు బయటపడింది..
Hospital

Updated on: Aug 14, 2026 | 1:38 PM

సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కిరాయి డాక్టర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల తీరు విభిన్నంగా ఉంది. రాత్రిపూట ప్రభుత్వ డాక్టర్లు డ్యూటీలకు రాకుండా వారి స్థానంలో ప్రైవేట్ వారిని విధుల్లో పెడుతున్నారు. ఈ నెల 6న ప్రైవేట్ డాక్టర్‌తో తన డ్యూటీ చేయిస్తున్న డిప్యూటీ సివిల్ సర్జన్ రమేష్‌ను TVVP ఇంచార్జ్ కమిషనర్ క్రిస్టినా సస్పెండ్ చేశారు. తాజాగా మరో ఇద్దరు డాక్టర్లు డిప్యూటీ సివిల్ సర్జన్ శివ శంకర్ రెడ్డి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ తుల్జా భవాని రెడ్డిలు ఇలానే చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో వీరిపై కూడా వేటు వేశారు.

అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ ఆదేశాలతో వైద్యులను అధికారులు సస్పెండ్ చేశారు. వారిపై ఎఫ్‌ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ వ్యవహరంపై మంత్రి సీరియస్ అయ్యారు. ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  వైద్యశాఖ మంత్రి ఇలాఖలోనే ఇలా జరగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన జోగిపేట పోలీసులు.. వారిపై క్రిమనల్ చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న వైద్యుల.. విధులను బహిష్కరించి వారి స్థానంలో ప్రైవేట్ డాక్టర్లను పంపిస్తున్నారు. ప్రవేట్ డాక్టర్లు.. ప్రభుత్వ డాక్టర్లుగా నటిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. వార్డుకు వచ్చే రోగులకు వీళ్లే  ప్రిస్క్రిప్షన్లు రాస్తూ అసలైన డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకున్నారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us