Telangana: తెలంగాణలో కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు.. పక్కా ప్లాన్‌ సిద్ధం చేసిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌.

|

Feb 09, 2023 | 2:42 PM

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే దిశగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే...

Telangana: తెలంగాణలో కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు.. పక్కా ప్లాన్‌ సిద్ధం చేసిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌.
Ts Govt Schools
Follow us on

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే దిశగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లల్లోనూ 12 రకాల వసతులతో తీర్చి దిద్దనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నే తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ భారీగా నిధులు కేటాయించింది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో పదివేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల నుంచి లైబ్రరీ సెస్సు బకాయిల వసూలుపై దృష్టి సారిస్తామని చెప్పారు. మండలిలో బుధవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం కోసం మొత్తం రూ.7,289.54 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం మూడు విడతల్లో 26,065 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదువుపాయాలను కల్పించనున్నామని పేర్కొన్నారు. తొలి దశలో 9,123 పాఠశాలల్లో జూన్ కల్లా పనులను పూర్తి చేస్తామన్నారు. రెండు, మూడు విడతల్లో బాలికలు ఎక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో మూత్రశాలల నిర్మాణం పై దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు.

ఇదిలా ఉంటే టీచర్ల ట్రాన్స్‌ఫర్‌ల ద్వారా మారుమూల పాఠశాలలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్న వాదనపై సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. ఒక పాఠశాలలో పనిచేసే అందరు ఉపాధ్యాయులు బదిలీ అయ్యి.. కొత్త టీచర్లు రాని పరిస్థితి ఉంటే, బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయబోమని స్పష్టం చేశారు. కొత్త టీచర్లు వచ్చే వరకు వారు అక్కడే కొనసాగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ టీచర్ లేని పాఠశాల ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..