Telangana: తెలంగాణలోని రైతులకు బిగ్ న్యూస్.. యూరియా బుకింగ్ కోసం కొత్త యాప్.. అందుబాటులోకి వచ్చేసింది..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. యూరియా బుకింగ్ కోసం కొత్త యాప్ తీసుకొచ్చింది. పాత యాప్ స్థానంలో కొత్త యాప్ రూపొందించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దీంతో రైతులు ఇక నుంచి ఈ యాప్ ఉఫయోగించాల్సి ఉంటుంది.

Telangana: తెలంగాణలోని రైతులకు బిగ్ న్యూస్.. యూరియా బుకింగ్ కోసం కొత్త యాప్.. అందుబాటులోకి వచ్చేసింది..
Urea Booking

Updated on: Sep 02, 2026 | 7:00 PM

తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ కీలక అప్డేట్ జారీ చేసింది. యరియా బుకింగ్ కోసం కొత్త యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో యూరియా బుక్ చేసుకునేందుకు ఫెర్టిలైజర్ బుకింగ్ పేరుతో ఒక యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తొలుత కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టగా.. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించింది. అయితే ఇప్పుడు ఆ యాప్ స్థానంలో కొత్త యాప్ తీసుకొచ్చింది. ఆ యాపే పేరే ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (FFS App) యాప్‌. ఇప్పటినుంచి ఈ యాప్ ద్వారా ఎరువులు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను ఈ యాప్ ద్వారా సులభంగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ భావిస్తోంది.

యాప్ ఉపయోగించడం ఎలా..?

-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ (FFS App) యాప్ డౌన్ లోడ్ చేసుకోండి

– తర్వాత ఫోన్‌లో యాప్ ఓపెన్ చేయండి

-మీ మొబైల్ నెంబర్‌, ఆధార్, పట్టాదారు పాస్ బుక్ వివరాలతో లాగిన్ అవ్వండి

-భూమి ఎంత సాగు చేస్తున్నారు.. ఎంత విస్తీర్ణంలో అనే వివరాలు అందించండి

-ఎంత పరిమాణంలో ఎరువులు కావాలనేది ఎంచుకోండి

-అనంతరం మీ సమీపంలోని ఎరువుల డీలర్ల సమాచారం లభిస్తుంది

-డీలర్‌ను సెలక్ట్ చేసుకుని ప్రోసీడ్ అవ్వండి

-క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది

-అనంతరం డీలర్ దగ్గరికి వెళ్లి క్యూఆర్ కోడ్ చూపించి ఎరువులు తీసుకోవాలి

పట్టాదారు పాస్ బుక్ లేకపోతే ఏం చేయాలి..?

పట్టాదారు పాస్ బుక్, ఫార్మర్ ఐడీ లేనివారు ఆధార్ నెంబర్‌తో లాగిన్ అయ్యి ఎరువులు బుక్ చేసుకోవచ్చు. ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఈ ఆప్షన్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవచ్చు. రెవెన్యూ రికార్డులు అప్డేట్ కానప్పుడు, చట్టబద్దమైన భూమి వారసులు కానప్పుడు ఈ విధానంలో ఎరువులు బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఎరువుల్లో జరిగే అక్రమాలు, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ యాప్ తీసుకొచ్చింది. పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితులు గతంలో ఉండేవి. ఇప్పుడు ఈ యాప్‌తో ఆ బాధ తప్పింది. ఇంటి వద్ద నుంచే మొబైల్ ద్వారా యూరియా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆధార్ ధృవీకరణ ద్వారా నిజంగా అవసరం ఉన్నవారికి మాత్రమే యూరియా అందిస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us