CM KCR: మీటర్లు పెట్టాలని బెదిరించారు.. అయినా అంగీకరించలేదు.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోటీలో నిలబడే అభ్యర్థులు ఖరారవడంతో.. ఇక.. ప్రచారం పైనే అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. ఎవరికి వారు తమదే గెలుపు అని చెబుతున్నా.. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మూడోసారి జయం మాదే అంటూ టాప్‌గేర్‌లో ప్రచారం నిర్వహిస్తోంది బీఆర్‌ఎస్‌. అటు.. హస్తం పార్టీ సైతం ప్రచారంలో హవా చూపిస్తోంది. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

CM KCR: మీటర్లు పెట్టాలని బెదిరించారు.. అయినా అంగీకరించలేదు.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
Cm Kcr

Updated on: Nov 14, 2023 | 10:18 PM

తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోటీలో నిలబడే అభ్యర్థులు ఖరారవడంతో.. ఇక.. ప్రచారం పైనే అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. ఎవరికి వారు తమదే గెలుపు అని చెబుతున్నా.. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మూడోసారి జయం మాదే అంటూ టాప్‌గేర్‌లో ప్రచారం నిర్వహిస్తోంది బీఆర్‌ఎస్‌. అటు.. హస్తం పార్టీ సైతం ప్రచారంలో హవా చూపిస్తోంది. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు 24 గంటల కరెంట్‌ అనవసరం అంటున్నారంటూ విమర్శించారు. బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ పాలకుర్తి, నాగార్జున సాగర్‌, ఇబ్రహీంపట్నం ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు. బీఆర్ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేసి.. అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. ఎన్నికలు రాగనే ఆగమాగం కావొద్దని.. అన్నీ ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని గులాబీ బాస్ పిలుపునిచ్చారు.

మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ బెదిరించారన్నారు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్. తెలంగాణకు రావాల్సిన 25 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కట్‌ చేసినా.. మీటర్లు పెట్టేందుకు అంగీకరించలేదన్నారు. 10 HP మోటర్‌ పెట్టుకుంటే రైతులకు మూడు గంటల కరెంట్‌ చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి చెప్తున్నారని.. రైతుల దగ్గర 10HP మోటార్లు ఉంటాయా అని ప్రశ్నించారు కేసీఆర్.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పేరు చెక్‌డ్యాం రావు అని పేరు పెట్టామన్నారు సీఎం కేసీఆర్. ఈ ఎన్నికల్లో దయాకర్‌ రావును గెలిపిస్తే అన్ని సమస్యలు పరిస్కరిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై కాంగ్రెస్‌ నేతలు 196 కేసులు వేశారన్నారు కేసీఆర్. అన్ని క్లియర్‌ చేసి ఈ మధ్యే ఆ ఎత్తిపోతలను ప్రారంభించామన్నారు.

తిరిగి అధికారంలోకి వచ్చాక రైతుబంధు దశల వారీగా 16 వేలకు పెంచుతామన్నారు కేసీఆర్. ధరణి పోర్టల్‌ తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు. రిజినల్‌ రింగు రోడ్డు వస్తే ఇబ్రహీంపట్నం రూపు రేఖలు మారిపోతాయన్నారు కేసీఆర్. ఫాక్స్‌కాన్‌ ఇండ్రస్ట్రీతో లక్ష మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మరిన్ని పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..