Telangana: తెలంగాణ దీపావళి సెలవు తేదీలో మార్పు.. వరసగా 3 సెలవులు

| Edited By: Janardhan Veluru

Nov 13, 2023 | 7:21 AM

దీపావళి సెలవులో తెలంగాణ ప్రభుత్వం మార్పు చేసింది. క్యాలెండర్‌లో గానీ, ప్రభుత్వం జారీ చేసిన పండగ సెలవుల జాబితాలో గానీ దీపావళి నవంబర్ 12వ తేదీ అని ఉంది. 12వ తేదీన ఉన్న సెలవును 13వ తేదీన సాధారణ సెలవుగా పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Telangana: తెలంగాణ దీపావళి సెలవు తేదీలో మార్పు.. వరసగా 3 సెలవులు
Diwali Holiday
Follow us on

దీపావళి సెలవు విషయంలో తెలంగాణ సర్కార్‌ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గతంలో దీపావళి సెలవుగా ప్రకటించిన తేదీని మార్చింది. ఈ మేరకు సెలవు దినాన్ని మారుస్తూ ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబర్ 12వ తేదీని దీపావళి సెలవుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తేదీని మారుస్తూ ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన ప్రకారం దీపావళి సెలవును నవంబర్ 13కు మారుస్తూ శుక్రవారం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మార్చిన సెలవు దినాన్ని పాఠశాలలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, సంస్ధలు, ప్రైవేటు సంస్ధలకు కూడా దీన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా జారీ చేయలేదు.

ఏటా తెలంగాణ సర్కార్ ఎంప్లాయిస్‌కు ఇచ్చే సాధారణ సెలవుల జాబితాను అంతకు ముందు సంవత్సరం డిసెంబర్‌లోనే విడుదల చేస్తుంది. ఆ జాబితా ప్రకారం నవంబర్ 12నే దీపావళి సెలవు కూడా ఇచ్చారు. అయితే తాజాగా పండితుల సలహా మేరకు సెలవు దినాన్ని మార్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను సవరించింది. దీంతో నవంబర్ 13వ తేదీని ఉద్యోగులతో పాటు ఆఫీసులు, వ్యాపార సంస్ధలు పాఠశాలలకు కూడా నెగోషియబుల్ చట్టం కింద ఈ సెలవు వర్తించబోతోంది. నవంబర్‌ 13వ తేదీన (సోమవారం) ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది.  దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీల‌కు రెండో శనివారం (నవంబర్‌ 11), ఆదివారం (నవంబర్‌ 12) ఆ మరుసటి రోజు సోమ‌వారం (నవంబర్‌ 13)తో కలుపుకుని వ‌రుసగా 3 రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.

ప్రతీ సంవత్సరం దీపావళి సెలవును (తిథి ద్వయం నాడు) తిధుల ఆధారంగా నిర్ణయిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈసారి కూడా గవర్నమెంట్‌కు వచ్చిన సలహాలు, వినతుల మేరకు దీపావళి సెలవు దినాన్ని మార్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి