పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్..! హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్‌ల వరకు కఠిన ఆదేశాలు!

యూనిఫామ్‌, అవినీతి రెండూ కలిసి ఉండలేవు..! ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు.. మనసులో అవినీతి ఆలోచనకు చోటు ఉండకూడదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే అక్రమ సంపాదనకు అలవాటు పడితే, వ్యవస్థకు అంతకంటే చేటు మరొకటి లేదు. బాధ్యత మరవకండి..! దారి తప్పకండి..! కొరడాతో ACB సిద్ధంగా ఉంది అంటూ... డిపార్ట్‌మెంట్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు పోలీస్ బాస్ శివధర్ రెడ్డి.

పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్..! హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్‌ల వరకు కఠిన ఆదేశాలు!
Telangana Dgp Shivadhar Reddy

Edited By:

Updated on: Apr 09, 2026 | 4:56 PM

యూనిఫామ్‌, అవినీతి రెండూ కలిసి ఉండలేవు..! ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు.. మనసులో అవినీతి ఆలోచనకు చోటు ఉండకూడదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే అక్రమ సంపాదనకు అలవాటు పడితే, వ్యవస్థకు అంతకంటే చేటు మరొకటి లేదు. బాధ్యత మరవకండి..! దారి తప్పకండి..! కొరడాతో ACB సిద్ధంగా ఉంది అంటూ… డిపార్ట్‌మెంట్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు పోలీస్ బాస్ శివధర్ రెడ్డి.

ఈ మధ్య వరుస దాడుల్లో పోలీసు సిబ్బంది ACBకి పట్టుడుతున్నారు. ఈ ఘటనలు పోలీస్ శాఖ ప్రతిష్టను మంటగలిపేలా ఉండటంతో డీజీపీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. హోమ్ గార్డ్ నుండి IPS వరకు అందరూ బాధ్యతతో పని చేయాలని DGP శివధర్ రెడ్డి సూచించారు. నిజాయితీతో విధులు నిర్వహించాలని గానీ.. దారితప్పి లంచం తీసుకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్.. ఇదే పోలీసుల లక్ష్యమంటూ సిబ్బందికి గుర్తుచేశారు.

ఈ మధ్య ACBకి పట్టుబడుతున్న తీరు చూస్తే.. పోలీసోళ్లా.. అవినీతోళ్లా..! అన్న అనుమానం కలుగుతోంది.

  1. ఏప్రిల్ 7న RGIA ఔట్‌పోస్ట్‌ ఇన్‌స్పెక్టర్ కనకయ్య, SI సిద్దేశ్వర్ ఏకంగా రూ.33 లక్షలు నొక్కేస్తూ ఏసీబీకి చిక్కారు.
  2. మార్చి 9న మల్కాజ్‌గిరి సైబర్‌ క్రైమ్‌లో SI ప్రమోద్ గౌడ్, బాబ్ నాయక్ చెరో లక్ష రూపాయలు తీసుకుంటూ దొరికిపోయారు.
  3. ఫిబ్రవరి 10న మాదాపూర్ ఎస్సై వినయ్ 50 వేల లంచంతో పట్టుబడ్డారు.
  4. గతేడాది నవంబర్ 12న ములుగు ఎస్సై విజయ్ 50 వేలు తీసుకుంటూ బుక్కైయ్యారు.
  5. నవంబర్ 18న మెదక్ ఎస్సై రాజేష్ 30 వేలు తీసుకుంటూ దొరికిపోయారు.
  6. ఈ ఏడాది మార్చి 26న నిర్మల్ ఎస్సై అశోక్ రూ. 20 వేల కోసం కక్కుర్తి పడి దొరికిపోయారు.
  7. జనవరి 8న వరంగల్ ఎస్సై శ్రీకాంత్ 15 వేలు తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు.

ఈ రేంజ్‌లో లంచాలు తీసుకుంటున్నారు కాబట్టే… యూనిఫామ్‌, కరప్షన్ ఒకేచోట ఉండవని డీజీపీ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us