Telangana Corona Cases Updates: తెలంగాణలో భారీగా పెరిగి కరోనా బాధితుల సంఖ్య.. అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే..

|

Apr 13, 2021 | 9:45 AM

Telangana Corona Cases Updates: తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. క్రమంగా రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యంగా విపరీతంగా..

Telangana Corona Cases Updates: తెలంగాణలో భారీగా పెరిగి కరోనా బాధితుల సంఖ్య.. అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే..
Corona
Follow us on

Telangana Corona Cases Updates: తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. క్రమంగా రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యంగా విపరీతంగా పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు వందల్లో నమోదైన కేసులు ఇప్పుడు ఏకంగా వేలకు పెరిగాయి. తాజాగా తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంగళవారం నాడు విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో 3,052 కేసులు నమోదు అయ్యాయి. 1,13,007 మంది నుంచి సాంపిల్స్ సేకరించగా.. వారిలో 3,052 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక నిన్న ఒక్క రోజు 778 మంది కరోనా నుంచి పూర్తి కోలుకున్నారు. కరోనా వైరస్ బారిన పడి గడిచిన 24 గంటల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,131 యాక్టీవ్ కేసులు ఉండగా.. వీరిలో 16,118 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

కాగా, తెలంగాణలో కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,32,581 మంది కరోనా బారిన పడినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో 3,06,678 మంది కరోనాను జయించి క్షేమంగా ఉన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1772 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.21 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 404 కరోనా పాజిటివ్‌లు నమోదు అయ్యాయి. ఆ తరువాత స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 301 కేసులు నమోదు అయ్యాయి. నిజామాబాద్‌లో 279, రంగారెడ్డి జిల్లాలో 248, సంగారెడ్డి 123, జగిత్యాల 135, కామారెడ్డి 111 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Also read:

Dil Raju Corona Positive: కరోనా బారిన పడిన నిర్మాత దిల్ రాజు.. టెన్షన్ లో మెగాస్టార్ ‘అభిమానులు’

వాష్ రూమ్ కి వెళ్లి వస్తా అంటూ పెళ్లి పీటల మీద నుంచి పారిపోయిన వధువు… చివరికి ఏమైందంటే… ( వీడియో )

Ragi Java: ఎండకాలంలో రాగిజావ తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.. రాగుల్లో ఉండే ప్రోటీన్స్‌ ఏమిటి..?