CM KCR Palle Pragathi Review: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో నిర్ధేశించిన ఏ పనిని పెండింగ్‌లో పెట్టకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జిల్లా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. జులై 1 నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
అభివృద్ధికి సంబంధించిన ఏ పనీ పెండింగ్‌లోఉండేందుకు వీల్లేదన్నారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం బాగా సహకరిస్తోంది. పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో సమీక్ష చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అభివృద్ధిలో ప్రజలను సైతం భాగస్వాములను చేయాలన్నారు. అలాగే, ప్రతి ఏటా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నారు సీఎం. గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి నాటించాలన్నారు. ఎన్నడూ లేని విధంగా పంటలతో రాష్ర్టం ధాన్యాగారంగా మారింది. ఈ క్రమంలో రాష్ర్టానికి అదనపు రైస్ మిల్లులు అవసరం ఉందన్నారు. రైస్ మిల్లుల సంఖ్యను పెంచి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), 2019 బ్యాచ్ ఐఏఎస్‌లు, డీఎఫ్ఓలు, కన్జర్వేటర్లు, డీపీవోలు, డీఆర్‌డీవోలు, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులు హాజరయ్యారు.
Read Also… Zomato: కీలక నిర్ణయం తీసుకున్న జొమాటో.. భారీ ఎత్తున మహిళలను తీసుకోనున్నట్లు ప్రకటన..