CM KCR Delhi Tour: ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. హస్తినకు చేరిన తెలంగాణ రాజకీయం

CM KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌ బేంగంపేట విమానాశ్రయం..

CM KCR Delhi Tour: ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. హస్తినకు చేరిన తెలంగాణ రాజకీయం
Telangana Cm Kcr

Updated on: Jul 26, 2022 | 9:36 AM

CM KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌ బేంగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ చేరుకున్న కేసీఆర్‌.. మూడు రోజుల పాటు హస్తినలో ఉండనున్నారు. కేసీఆర్‌ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌తో పాటు ఎంపీలు, ఇతర నేతలు మంత్రులున్నారు. ఢిల్లీ చేరుకున్న కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరరావు స్వాగతం పలికారు. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్రపతిని కలువనున్న కేసీఆర్‌

ఢిల్లీ పర్యనటలో భాగంగా కేసీఆర్‌ కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న పోడు భూముల చట్టసవరణ, రాష్ట్ర గిరిజన, మైనార్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం, ఇటీవల తెలంగాణ నుంచి కొన్ని మండలాలు ఏపీలో కలువడంతో వాటిని తిరిగి రప్పించడం తదితర అంశాలపై రాష్ట్రపతికి విన్నవించనున్నట్లు తెలుస్తోంది. అలాగే వివిధ కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు, వరద సాయం తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. అలాగే టీఆర్‌ఎస్‌ ఎంపీలతో భేటీ కానున్నారు.

ఇవి కూడా చదవండి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి