Chicken Shops: నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. ఆ రోజు నుంచి చికెన్ షాప్‌లు బంద్!

హైదరాబాద్ నగరంలో చికెన్ వ్యాపారం కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లాభాలు తగ్గిపోవడంతో చికెన్ షాపు యజమానులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి నగరంలోని చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. పలుచోట్ల కనిపిస్తున్న పోస్టర్లు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

Chicken Shops: నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. ఆ రోజు నుంచి చికెన్ షాప్‌లు బంద్!
Chicken Shops Closed In Hyderabad

Edited By:

Updated on: Mar 25, 2026 | 4:47 PM

పౌల్ట్రీ కంపెనీలు సరిపడా లాభ మార్జిన్లు ఇవ్వడం లేదని, దాంతో వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న ఆదాయం మధ్య చిక్కుకుని షాపులు నడపడం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై నిరసనగా తెలంగాణ చికెన్ షాప్ యజమానుల సంఘం బంద్‌కు పిలుపునిచ్చింది. లాభ మార్జిన్లు పెంచేవరకు ఈ బంద్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో నగరంలో చికెన్ సరఫరాపై ప్రభావం పడే అవకాశముంది.

గుడ్ల ధరలు ఢమాల్

ఇదిలా ఉంటే, నగరంలో గుడ్ల ధరలు ఇటీవలి రోజుల్లో చాలా తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాలే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల పశ్చిమ ఆసియా దేశాలకు గుడ్ల ఎగుమతులు దెబ్బతిన్నాయి. భద్రతా ఆందోళనలు, రవాణా మార్గాల అంతరాయం కారణంగా పోర్టులు, విమానాశ్రయాలు పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నాయి. దీంతో భారతదేశం నుంచి గుడ్ల ఎగుమతులు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోయాయి. ఎగుమతులు ఆగిపోవడంతో స్థానిక మార్కెట్‌లో సరఫరా పెరిగి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.

ఒకవైపు చికెన్ షాపుల బంద్, మరోవైపు గుడ్ల ధరల పతనం..ఈ రెండు పరిణామాలు నగరంలో పౌల్ట్రీ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వ్యాపారుల డిమాండ్లపై ప్రభుత్వం, కంపెనీలు ఎలా స్పందిస్తాయన్నదే ఇప్పుడు కీలకం. పరిస్థితి ఇలాగే కొనసాగితే వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us