Telangana: ఈ కుట్ర వెనుక ఓ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తనయుడి హస్తం ఉంది : బండి సంజయ్

Updated on: Oct 26, 2022 | 11:36 PM

ప్రలోభాలు జరిగాయ్.. కానీ ఎవరు ఎవర్ని ప్రలోభపెట్టారు? కోట్లకు కోట్ల ఆఫర్ నడిచింది. కానీ ఎంత, ఎవరెవరికి ఆఫర్ ఇచ్చారు?క్యాష్ సీజ్ చేశారా లేదా? చేస్తే ఎంత? ఇంత బిగ్ ఆపరేషన్‌లో తేలాల్సిన బిగ్ క్వశ్చన్స్‌ ఇవి.

ఎమ్మెల్యేల ట్రాప్ వ్యవహారంపై  టీవీ 9 నేరుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడింది. ఇక ఇదంతా ప్రగతి భవన్ డైరక్షన్లో నడిచిన డ్రామా అన్నారాయన. మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ దిగజారుడు రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేలతో మాకేం పని అంటూ వ్యాఖ్యానించిన కిషన్ రెడ్డి ఆ నలుగురి కోసం ఢిల్లీ వాళ్లు ప్లాన్ చెయ్యాల్సినవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితోనైనా విచారణ జరిపించేందుకు తాము సిద్ధమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మరో బీజేపీ నేత డీకే అరుణది కూడా అదే మాట. చిల్లర రాజకీయాలు చెయ్యడంలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారామె. మునుగోడులో ఓడిపోతున్నామనే ఈ డ్రామా ఆడుతున్నారని అరుణ విమర్శించారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహుని సాక్షిగా చెప్పగలరా అని ఆమె ప్రశ్నించారు. తాజాగా ఇదే అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

Published on: Oct 26, 2022 11:08 PM