దుమ్ముదుమారం.. 22Aపై కీలక చర్చ..! తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. 22Aపై అసెంబ్లీ, శాసన మండలిలో చర్చ జరగనుంది. తెలంగాణ శాసనమండలిలో 22Aపై వెంటనే చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్లకార్డులతో నిరసన, వాకౌట్‌కు దిగింది. మార్షల్స్ మోహరింపుపై అభ్యంతరాలు వ్యక్తం కాగా, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. 22Aపై అసెంబ్లీ, శాసన మండలిలో చర్చ జరగనుంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు. జనగణన–2027పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీసీ/ఓబీసీ కాలమ్‌ను జనగణన ప్రశ్నావళిలో చేర్చే అంశంపై కూడా చర్చింనున్నారు. అయితే.. మండలిలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యుల నిరసన తెలిపారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని..బీఆర్ఎస్ సభ్యులు సహకరించాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలపై నిర్ణయం తీసుకుంటామని.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాయిదా తీర్మానాలు తిరస్కరించారు. దీంతో శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌంట్ చేశారు.
శాసనమండలిలో మార్షల్స్ మోహరింపుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తంచేసింది. మండలి సభ్యుల కోసమా.. మార్షల్స్ కోసమా..? అని మధుసూదనాచారి ప్రశ్నించారు. సభ్యులు సభలో సహకరిస్తే మార్షల్స్ అవసరం లేదని చైర్మన్ చెప్పారు. వెంటనే 22Aపై చర్చించాలంటూ మధుసూదనాచారి డిమాండ్ చేశారు.
మరో రెండు రోజుల్లో తెలంగాణ శాసన మండలి ఎథిక్స్ కమిటీ భేటీ కానుంది. ఆ సమావేశంలో తాతామధు, నవీన్‌రెడ్డిపై ఏం చర్యలు తీసుకోవాలో తేలే అవకాశం ఉన్నట్లు సమాచారం.. నిన్న జరిగిన కమిటీ మీటింగ్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్పీకర్‌పై మధు వాడిన పదజాలం, నవీన్ ప్రవర్తన వీడియోను మహేష్‌గౌడ్ చూపించారు.. మహేష్‌గౌడ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విభేదించారు. కావాలనే తమ సభ్యుల్ని టార్గెట్ చేశారని పేర్కొన్నారు. రెండురోజుల తర్వాత జరిగే భేటీలో మాత్రం నిర్ణయం తీసుకుని తీరాలని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
