Telangana Election: తెలంగాణ బాట పట్టిన జాతీయ నేతలు.. రెండు రోజులపాటు ప్రియాంక టూర్

|

Nov 23, 2023 | 10:01 PM

తెలంగాణ దంగల్‌లో కాంగ్రెస్‌ జోరు పెంచింది. ఒక వైపు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం రంగంలోకి దిగారు. తొలి విడతలో భాగంగా ఇటీవలె ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో ప్రచారం చేశారు. ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌లలో జరిగిన సభల్లో ప్రియాంక పాల్గొన్నారు.

Telangana Election:  తెలంగాణ బాట పట్టిన జాతీయ నేతలు.. రెండు రోజులపాటు ప్రియాంక టూర్
Priyanka Gandhi in Congress Public meeting in Thorur showered promises for Telangana Elections
Follow us on

తెలంగాణ దంగల్‌లో కాంగ్రెస్‌ జోరు పెంచింది. ఒక వైపు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం రంగంలోకి దిగారు. తొలి విడతలో భాగంగా ఇటీవలె ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో ప్రచారం చేశారు. ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌లలో జరిగిన సభల్లో ప్రియాంక పాల్గొన్నారు.

తాజాగా మరోసారి తెలంగాణ బాట పట్టారు ప్రియాంక గాంధీ. తెలంగాణలో ప్రియాంకాగాంధీ సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్ర, శనివారాలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు తెలంగాణ పీసీసీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్నాబాద్‌ నియోజకవర్గంలో, సాయంత్రం మూడు గంటలకు కొత్తగూడెంలో నిర్వహించే ప్రచార ర్యాలీలో పాల్గొంటారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.

ఇక నవంబర్ 24వ తేదీ రాత్రి ఖమ్మంలోనే బస చేస్తారు ప్రియాంక గాంధీ. నవంబర్ 25న ఉదయం 11 గంటలకు పాలేరు నియోజకవర్గంలో నిర్వహించే ప్రచార సభకు హాజరవుతారు. మధ్యాహ్నాం 1.30 గంటలకు సత్తుపల్లి, 2.40 గంటలకు మధిర ప్రచార సభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకుని, గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమవుతారు ప్రియాంక గాంధీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…