Telangana Lockdown : తెలంగాణలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు

|

May 22, 2021 | 2:10 PM

Lockdown : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలో ఈ రోజు ఉదయం గం. 10 నుంచి లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని

Telangana Lockdown : తెలంగాణలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు
Lockdown
Follow us on

Lockdown restrictions strictly from today 10am : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలో ఈ రోజు ఉదయం గం. 10 నుంచి లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. లాక్ డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటం.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతోన్న నేపథ్యంలో ఇంకాస్త కఠినంగా లాక్ డౌన్ విషయంలో ముందుకెళ్లాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది.

ఈ సంద‌ర్భంగా పోలీస్ శాఖ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చేసిన ప‌లు సూచ‌న‌లు ఇలా ఉన్నాయి :

* రాష్ట్రం లో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణా లపై ఏవిధమైన ఆంక్షలు లేవు.

* జాతీయ రహదారులపై రవాణా పై ఏవిధమైన ఆంక్షలు లేవు.

* ప్రధాన రంగంలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్ కార్డులు కానీ, సంస్థాపరమైన గుర్తింపు కార్డులు తమవెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

* గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్ డౌన్ నుండి మినహాయింపు.

* ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుంది.

* రాష్ట్రం లో జరిగే వివాహాలకు ఇరువైపుల చెందిన 40 మంది మాత్రమే హాజరయ్యేవిధంగా చూడాలి.

* వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలి.

* మరణాలకు సంబంధించి కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలి.

* కరోనా వాక్సినేషన్ కు ఎవరైనా వెళ్లాల్సివస్తే వారి మొదటి డోస్ కు సంబంధించిన సమాచారం సెల్ ఫోన్ లో చూసి వారికి సడలింపు ఇవ్వాలి.

* నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

* నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలి.

* ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం తో పాటు ఐపీసీ ప్రకారం తగు కేసులు నమోదు చేయాలి.

Read also : Anandayya medicine : సీఎం సూచనల మేరకు కృష్ణపట్నం చేరుకున్న ICMR బృందం.. ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుపై పరిశీలన