
రాష్ట్రంలోని విద్యుత్ శాఖ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది.ప్రతి ఏటా ఉద్యోగులకు అందించే కరువు భత్యం డీఏను 17.651 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పెంచిన డీఏను గత జూలై నెల నుంచి అమలయ్యే విధంగా అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యుత్ శాఖ పరిధిలోని పనిచేస్తున్న 71,387 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజెన్లు, పెన్షనర్లు లబ్ది చేకూరనుంది.
సంస్థల వారీగా ఉద్యోగుల డీఏ పెంపు
టీజీ ట్రాన్స్‌కో: ప్రభుత్వం నిర్ణయంతో టీజీ ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న 3,036 మంది ఉద్యోగులకు, 3,769 మంది ఆర్టిజన్లకు, 2,446 మంది పెన్షనర్లతో కలిపి మొత్తంగా 9,251 మందికి చేకూరనున్న లబ్ధి
జెన్ కో: ఇక జెన్కోలో పనిచేస్తున్న 6,913 మంది ఉద్యోగులు, 3,583 మంది ఆర్టిజన్లకు, 3,579 మంది పెన్షనర్లకు చేకూరనున్న లబ్ధి
ఎస్పీడీసీఎల్:TGPDCL లో 11,957 మంది ఉద్యోగులకు 8,244 మంది ఆర్టిజన్లకు, 8,244 మంది పెన్షనర్లకు చేకూరనున్న లబ్ధి
ఎన్పీడీసీఎల్: NPDCLలో 9,728 మంది ఉద్యోగులకు 3,465 మంది ఆర్టిజన్లకు, 6,115 మంది పెన్షనర్లకు లబ్ధి జరగనుంది.
ఇక విద్యుత్ శాఖలోని అన్ని సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు మొత్తం కలిపి 71,387 మందికి లబ్ధి చేకూరనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.