Telangana: భార్య కాపురానికి రావట్లేదని మనస్తాపం.. ఫుల్లుగా మద్యం సేవించిన యువకుడు ఏం చేశాడంటే..

|

Feb 23, 2022 | 7:07 PM

Telangana: తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశం ఓ యువకుడి నిండు ప్రాణం బలైంది. వివరాల్లోకెళితే.. మహబూబ్‌నగర్..

Telangana: భార్య కాపురానికి రావట్లేదని మనస్తాపం.. ఫుల్లుగా మద్యం సేవించిన యువకుడు ఏం చేశాడంటే..
Cell Tower
Follow us on

Telangana: తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశం ఓ యువకుడి నిండు ప్రాణం బలైంది. వివరాల్లోకెళితే.. మహబూబ్‌నగర్ జబ్చర్ల పాత బజార్ ప్రాంతానికి చెందిన యాదయ్య అనే ఓ యువకుడికి, అతని భార్యకు మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దాంతో అతని భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి కాపురానికి రావాల్సిందిగా కోరగా.. ఆమె రాలేదు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన యాదయ్య.. బుధవారం నాడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ మత్తులోనే సెల్ టవర్ ఎక్కాడు. పలువురు అతన్ని వారించి.. సర్ధి చెప్పగా సెల్ టవర్ దిగిందుకు సిద్ధమయ్యాడు. అలా సెల్ టవర్ దిగుతుండగా.. ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు యాదయ్య. ఈ ఘటనలో యాదయ్య స్పాట్ డెడ్ అయ్యాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎమ్మెల్యే సర్ధి చెప్పడంతో..
ఇదిలాఉంటే.. ఇలాంటిదే మరో ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బెల్లంపల్లి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఒదేలు.. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే దారి లేక, అప్పులు ఇచ్చిన వారి పోరు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఒదేలు. ఈ క్రమంలోనే పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్న చేశాడు. అయితే, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. సెల్ టవర్ వద్దకు చేరుకున్నారు. బాధితుడికి ఫోన్ కాల్ చేసి నచ్చజెప్పారు ఎమ్మెల్యే. దాంతో ఓదెలు సెల్ టవర్ దిగి క్షేమంగా కిందకు చేరాడు.

Also read:

Green Energy: గ్రీన్‌ ఎనర్జీలో భారత్‌ అగ్రగామిగా నిలుస్తుంది.. 21 వ శతాబ్దం మనదే: ముఖేష్ అంబానీ

India vs Sri Lanka 1st T20: అభిమాన ప్లేయర్ కోసం రోడ్డెక్కిన ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

CJI NV Ramana: ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్..25 రోజులు అవుతున్నా ఇబ్బంది పడుతున్నా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు..