ప్రతి యుగానికి ఒకరు పుడతారు.. ఆ యుగపురుషుడే కేసీఆర్

ప్రతి యుగానికి ఒకరు పుడతారు అతనే యుగపురుషుడు అవుతారు...ఆయనే కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ అధినేతను కొనియాడారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా చరిత్రలో కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పారు.

ప్రతి యుగానికి ఒకరు పుడతారు.. ఆ యుగపురుషుడే కేసీఆర్

Updated on: Sep 12, 2020 | 5:32 PM

ప్రతి యుగానికి ఒకరు పుడతారు అతనే యుగపురుషుడు అవుతారు…ఆయనే కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ అధినేతను కొనియాడారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా చరిత్రలో కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజక్టుపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే సినిమా అన్నారు.. ఇవ్వాళ సినిమా నిజం అయిందని తలసాని గుర్తుచేశారు. 7 దశాబ్దాల కాలం నుంచి వస్తున్న బాధ కొత్త రెవెన్యూ చట్టంతో తొలిగిపోతుందని ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని మంత్రి అన్నారు. ప్రభుత్వాలు-నాయకులు మారినా యంత్రాంగం మాత్రమే మారదని దానిని కూడా ప్రక్షాళన చేసిన ఘనత కేసీఆర్ దని తలసాని అన్నారు… పీపీఈ కిట్లు దాపెట్టుకున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు వింటే నవ్వొస్తుందన్న ఆయన.. కేంద్ర బృందాలు సైతం కొరొనా విషయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నాయన్నారు. ఆరోగ్రశ్రీ ముందు ఆయుష్మాన్ భారత్ పనికిరాదని తలసాని చెప్పుకొచ్చారు. కోట్లాది మంది ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి తో పెళ్ళిచేసిన ఘనత టీఆరెస్ ప్రభుత్వానిది.. కేసీఆర్ ది అంటూ తలసాని ముఖ్యమంత్రిని ఆకాశానికెత్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us