తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నాయి ప్రధాన పార్టీలు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలను ప్రిస్టేజియస్‌గా తీసుకుంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంలో ఉన్న బీజేపీ మరిన్ని లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తోంది. గతంలో జరిగిన లోపాలు అధిగమించి 17 ఎంపీ స్థానాల్లో 10టార్గెట్ గా పావులు కదుపుతుంది బీజీపీ. దీని కోసం గ్రౌండ్ లెవల్‌లో వర్క్ స్టార్ట్ చేసింది. అంతేకాదు.. ఉత్తర తెలంగాణాలో పార్టీకి పట్టు చిక్కడం.. మంచి ఫలితాలు రావడంతో ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది బీజేపీ. క్యాండిడెట్ ఎంపికతో పాటు.. క్యాడర్ సమాయత్తం చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తుంది బీజేపీ. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని అంతకంటే ముందే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కమలదళం నిర్దేశించుకుంది. కేంద్ర పథకాల లబ్ధిదారుల జాబితా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసేందుకు మరో ప్రణాళిక సిద్ధంచేస్తోంది.
ఎన్నికల కార్యాచరణలో భాగంగా కీలకాంశాలపై బీజేపీ దృష్టిసారించింది. లాస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో 4సీట్లను ఈసారి 10కి పెంచాలని యోచిస్తుంది. అటు కేంద్ర బీజేపీ నేతలు సైతం తెలంగాణ పార్టీ పరిస్థితిని నిషితంగా గమనిస్తున్నారు. మొన్నటికి మొన్నే హైదరాబాద్ లో పర్యటించిన కేంద్రహోంమంత్రి అమిత్ షా పార్టీ యాక్టివిటీని అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా ముందుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. హైదరాబాద్ వేదికగా అమిత్ షా నాయకత్వంలో జరిగిన పార్లమెంట్ ప్రిపరేషన్ మీటింగ్ లో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో హ్యాట్రిక్ సాధించాలంటే ప్రతి సీటు కూడా సీరియస్ గా తీసుకోవాలని కేడర్‌కు దిశానిర్ధేశం చేశారు అమిత్ షా. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను క్యాడర్ తో చర్చించారు. దశలవారీగా ప్రచార కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని.. ప్రతి ఓటరును చేరుకునేలా పార్టీ అనుబంధ విభాగాలకు లక్ష్యాన్ని నిర్దేశించారు.
17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉండడంతో టిక్కెట్ల కేటాయింపు అంశం కూడా వాడివేడిగా పార్టీలో చర్చ జరుగుతుంది. ఒత్తిళ్లకు తలొగ్గకుండా సర్వేల ఆధారంగా బలమైన అభ్యర్థులను గుర్తించేపనిలో పడింది టీబీజేపీ. ఈ నెల 7,8తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే సమావేశంలో పార్టీలో సంస్థాగత మార్పులు అభ్యర్థుల ఎంపిక పై కూడా కీలక చర్చ జరగబోదనే టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా తెలంగాణపై పూర్తి స్థాయిలో పట్టుసాధించేందుకు త్వరలోనే ఢిల్లీ నుండి పరిశీలకులు కూడా రాబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..