కామారెడ్డి జిల్లాలో స్పీకర్‌ పోచారం పర్యటన.. అంగన్‌వాడీ టీచర్లకు నూతన వస్త్రాలు.. వికలాంగులకు సైకిళ్ల పంపిణీ

|

Feb 06, 2021 | 3:54 PM

కామారెడ్డి జిల్లాలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. బాన్సువాడ, బీర్కుర్‌, నసరుల్లాబాద్‌ మండలాల పరిధిలోని అండన్‌వాడీ..

కామారెడ్డి జిల్లాలో స్పీకర్‌ పోచారం పర్యటన.. అంగన్‌వాడీ టీచర్లకు నూతన వస్త్రాలు.. వికలాంగులకు సైకిళ్ల పంపిణీ
Follow us on

కామారెడ్డి జిల్లాలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. బాన్సువాడ, బీర్కుర్‌, నసరుల్లాబాద్‌ మండలాల పరిధిలోని అండన్‌వాడీ టీచర్లు, ఆయాలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు.

గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తే పుట్టబోయే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. పుట్టినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే.. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. మహిళలకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంతోనే సుఖ ప్రసవాలు పెరిగాయన్నారు. 70శాతం నార్మల్ డెలివరీలు‌, 30 శాతం ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు.

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో మాతాశిశు ఆసుపత్రిని రూ.20కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 

Read more:

ఆ యువకుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి.. జాతీయ ఎస్సీ కమిషన్‌కు నారా లోకేష్‌ లేఖ