Revanth Reddy: తెలంగాణలో సోనియమ్మ రాజ్యం తేస్తామన్న రేవంత్.. కాంగ్రెస్ దళిత, గిరిజన దీక్షలో కనిపించని సీనియర్లు

|

Aug 25, 2021 | 6:53 PM

తెలంగాణలో సోనియమ్మ రాజ్యాన్ని తెచ్చేందుకు కృషిచేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లాలోని మూడు చింతలపల్లిలో కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన దీక్షలో ఆయన పాల్గొన్నారు.

Revanth Reddy: తెలంగాణలో సోనియమ్మ రాజ్యం తేస్తామన్న రేవంత్.. కాంగ్రెస్ దళిత, గిరిజన దీక్షలో కనిపించని సీనియర్లు
Revanth Reddy
Follow us on

Revanth Reddy: తెలంగాణలో సోనియమ్మ రాజ్యాన్ని తెచ్చేందుకు కృషిచేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లాలోని మూడు చింతలపల్లిలో కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన దీక్షలో ఆయన పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిరసనలో కూర్చున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీక్ష విరమించారు.

దళిత, గిరిజన దండోరా సభలు…దీక్షలతో జోష్ పెంచింది కాంగ్రెస్. ఇప్పటికే ఇంద్రవెల్లి, రావిరాలలో సభలు నిర్వహించింది కాంగ్రెస్. ఇప్పుడు మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో చేపట్టిన 2 రోజుల దీక్ష ముగిసింది. అయితే ఈ దీక్షలో ఎక్కడా సీనియర్లు పెద్దగా కనిపించలేదు. రేవంత్ పీసీసీ చీఫ్‌ అయిన తర్వాత పార్టీలో కొంత వర్గపోరు నడుస్తోంది. దండోరా సభల నిర్వహణ, వేదికల ఖరారు విషయంలోనూ సీనియర్లలో అసంతృప్తి ఉంది. కొంతమంది బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు మాత్రం సహాయనిరాకరణ చేస్తున్నారు. 3 చింతలపల్లి దీక్ష విషయంలోనూ ఇదే కంటిన్యూ అయిందన్న టాక్‌ నడుస్తోంది. అటు తెలంగాణలో సోనియమ్మ రాజ్యం తెచ్చేందుకు అందరూ కృషిచేయాలన్నారు రేవంత్‌రెడ్డి. తరువాతి దండోరా సభ ఎక్కడన్నది ఇంకా క్లారిటీ రాలేదు..

మొదటి రోజు గ్రామంలోని దళితవాడలో నిద్రించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రెండో రోజు రచ్చబండ నిర్వహించారు. దళితవాడలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో తిరిగి అక్కడికి పరిస్థితులను పరిశీలించారు. పలువురు దళితులు తమ గ్రామ సమస్యలను రేవంత్‌కు వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్‌ హరీశ్‌కు ఫోన్‌ చేసి మూడుచింతలపల్లి స్థానిక సమస్యలను వివరించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రేవంత్‌ కోరారు. మూడుచింతలపల్లి దీక్షకు స్థానిక టీఆర్ఎస్ నేతల నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఎదురైంది. దారిపొడవున ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమపథకాలను ప్రదర్శించారు. రేవంత్ గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు..

Read Also…  Narayan Rane: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కేంద్రమంత్రి నారాయణ రాణే‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..ఇంతకీ ఏం జరిగిందంటే..?