Telangana: రండిరా.. దయచేయండి.. సిద్దిపేటలో పాముల పక్కా ప్లానింగ్

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో చాలా చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. దీంతో చేపల సందడి నెలకుంది. అయితే అలా మత్తడి దూకేచోట కొన్ని పాములు చేపల కోసం మాటు వేసి ఉన్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ..

Telangana: రండిరా.. దయచేయండి.. సిద్దిపేటలో పాముల పక్కా ప్లానింగ్
Snakes

Updated on: Oct 08, 2025 | 3:44 PM

పాములకు తెలివి లేదనుకుంటే మీరు పొరబడినట్లే. అవి కూడా చాలా స్మార్ట్. ఆహారం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తాయి. తాజాగా కొన్ని నీటి పాములు చేపల్ని ఈజీగా ఆహారంలా మార్చుకునేందుకు.. వేసిన ప్లాన్ చూస్తూ మీరూ ఆశ్చర్యపోవాల్సిందే. సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండల కేంద్రంలోని చెరువులో చోటుచేసుకున్న ఓ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చెరువు నిండిపోయి, నీరు ఓవర్‌ఫ్లో అవుతుండగా.. ఆ ప్రాంతం వద్ద ఒకే రాయిమీద దాదాపు డజను నీటి పాములు వరుసగా మాటు వేసి కనిపించాయి. నీటి ప్రవాహం నుంచి బయటకు ఎగిరే చేపల కోసం ఆ పాములు కళ్లప్పగించి ఎదురుచూస్తున్నాయి.

ఇంకా కొన్ని పాములు అక్కడి నీటిలో ఈదుకుంటూ వేటలో మునిగిపోయాయి. ఈ దృశ్యాన్ని ఒక స్థానిక వ్యక్తి వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. క్షణాల్లోనే వైరల్ అయింది. చెరువు నిండిన ప్రతిసారి ఇలాగే పాములు వస్తుంటాయని గ్రామస్థులు చెబుతున్నారు. కానీ ఈ సారి ఒకే రాయిమీద వరుసగా కూర్చుని చేపల కోసం ఎదురుచూసిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. కాగా ఈ పాములు విషరహితమైనవి. ఇవి చెరువులు, కాలువలు, నదుల దగ్గర జీవిస్తాయి. చేపలు, కప్పలు, ఇతర చిన్న, చిన్న జలచరాలను ఆహారంగా చేసుకుంటాయి.

వీడియో దిగువన చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..