
ఇటీవల ఎక్కడపడితే అక్కడ పాములు కనిపిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాలు కురవడంతో పుట్టల్లో, అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తూ ఎక్కడపడితే అక్కడ తిష్టవేసి ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య పాముల సయ్యాటలు ఎక్కువైపోయాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ జంటపాములు సయ్యాటకు దిగుతూ జనాలను కట్టిపడేస్తున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఆర్డీవో ఆఫీసు ఆవరణలో జంటపాములు హల్‌చల్ చేశాయి. తాజాగా నిర్మల్ జిల్లాలో జంటపాములు కనిపించాయి.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఓ పంట చేనులో సర్పాల సయ్యాట స్థానికంగా చర్చనీయాంశమైంది. పంట పొలంలో రెండు పాములు ఒకదానితో ఒకటి పెనవేసుకుని సయ్యాట ఆడుతున్న వీడియో స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాలను స్థానికులు తమ సెల్‌ఫోనల్లో చిత్రీకరించారు. జనం చుట్టుముట్టి అలికిడి చేసినా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రెండు సర్పాలు సయ్యటాలో మునిగిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా పాములకు ఇప్పుడు మేటింగ్ సీజన్ అని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.