Snakebite: హృదయవిదారక ఘటన.. పాములు పట్టే వ్యక్తి.. అదే పాము కాటుకు బలి

|

Aug 28, 2021 | 11:01 AM

పాములు పట్టే వ్యక్తి.. ఊహించని విధంగా అదే పాముకు బలవ్వడం నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో కలకలం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Snakebite: హృదయవిదారక ఘటన.. పాములు పట్టే వ్యక్తి.. అదే పాము కాటుకు బలి
Snake Bite
Follow us on

పాములు పట్టే వ్యక్తి.. అదే పాముకు బలైన హృదయవిదారక ఘటన నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో చోటుచేసుకుంది.   గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఉట్కూర్ మండల కేంద్రంలో శ్రీరామ్ నగర్ ప్రాంతానికి చెందిన జి నాగరాజు మహారాష్ట్రకు వలస వెళ్లి నాలుగేళ్ల కిందట స్వగ్రామానికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇళ్లలోకి వచ్చిన పాములను పట్టుకొని అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేవాడు. దాదాపు 50కి పైగా పాములను అతడు రక్షించాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఓ ఇంట్లోకి వచ్చిన పామును పట్టి.. బయటకు తీసుకువెళ్తూ ఉండగా.. అనుకోకుండా అది కాటు వేసింది. దీంతో కోపోద్రేక్తుడైన నాగరాజు దాన్ని చంపేశాడు. అయితే పాము కాటుకు అతడు ఎలాంటి వైద్యం తీసుకోలేదు. దీంతో నిద్రించిన చోటే మృతిచెందాడు.

శ్రీకాళహస్తి దేవాలయంలో నాగుపాము హల్చల్..

శ్రీకాళహస్తి దేవాలయంలో నాగుపాము టెన్షన్ రేపింది. అమ్మవార్ల దర్శనార్థం వెళ్లే మార్గంలోని రంగులగోపురం వద్ద కాసేపు తారసలాడింది. దీంతో భక్తులు అక్కడ్నుంచి పరుగులు తీశారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పామును పట్టుకుని మల్లెమడుగు చెరువులో వదిలిపెట్టారు. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రస్తుతం వర్షాకాలం కావడంతో.. వరదల కారణంగా పుట్టల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో తరచుగా పాములు హల్‌చల్ చేస్తున్న ఘటనలు మనం చూస్తున్నాం. రోజూ ఏదో ఒక ప్రాంతంలో పాము టెన్షన్ పెట్టించిన వార్తులు చూస్తూనే ఉన్నాం. కాగా పల్లెటూర్లలో ఉండే జనాలు అప్రమత్తంగా ఉండాలని, పాములు కనిపిస్తే చంపకుండా.. అటవీ శాఖ సిబ్బందికి లేదా స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులకు కోరుతున్నారు.

Also Read:నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. నవ వధువు, ఆమె తండ్రి స్పాట్‌లోనే మృతి

కాకినాడ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు వద్ద క్రేజీ సీన్.. ప్రేమించి, పెళ్లాడిన యువతి కోసం సినిమా స్టైల్లో