Shocking Road accident: చిన్న నిర్లక్ష్యం.. ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో చెప్పలేం. హైదరాబాద్ ఔట్‌కట్స్‌లో శామీర్‌పేట్ దగ్గర జరిగిన తాజా యాక్సిడెంట్ చూస్తే షాకవడమేకాదు, గుండెలు చెదిరిపోతాయి. ఫోర్‌లేన్ రోడ్‌లో యధావిధిగా వాహనాలు వెళ్తున్నాయి. నాలుగు రోడ్ల కూడలిలోని రోడ్ క్రాసింగ్ దగ్గర ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. స్కూటీపై నెమ్మదిగా రోడ్డు క్రాస్ చేసి.. యూటర్న్ తీసుకోబోయాడు ఓ బైకర్. అయితే, వాళ్లను అమాంతం ఢీకొట్టాడు మరో బైకర్. అతను వస్తున్న స్పీడ్ చూడండి. ఎంత ఓవర్ స్పీడో. ఏమాత్రం కంట్రోల్ చేసేందుకు వీల్లేదు. అతను కనీసం బ్రేక్ వేసే ప్రయత్నం కూడా చేసినట్టు లేడు.
ఈ యాక్సిడెంట్‌కు కారకులెవరు? మనం చూస్తున్న సీసీ ఫుటేజ్‌లో స్కూటీ రైడర్.. సైడ్ ఇండికేటర్ వేసినట్టు కనిపించడం లేదు. సో, అతనిది తప్పు అనుకోవాలా? అలాగని అతనేమీ సడెన్‌గా టర్న్ తీసుకోలేదు. నెమ్మదిగా వస్తున్నాడు. సో, స్ట్రెయిట్‌గా వెళ్తున్న బైకర్ స్లో అయ్యేందుకు వీలుంది. పోనీ అలాకాపోతే, పక్కనించి పోనిచ్చే అవకాశాన్ని కూడా స్పీడ్ బైకర్ ఆలోచించలేదు. కానీ.. అతను వెళ్తున్న స్పీడ్‌కు ఏమాత్రం కంట్రోల్ కాలేకపోయాడు.
శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే జరిగిన ఈ యాక్సిడెంట్‌లో.. ఒకరి ప్రాణం పోయింది. మిగతా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రోడ్ యాక్సిడెంట్ స్పాట్ సీసీటీవీ ఫుటేజ్ లో యాక్సిడెంట్ ఘటన మొత్తం రికార్డయింది.