‘ఈ పొద్దు ఈ పార్టీ.. ఆ పొద్దు మరో పార్టీ’.. లోక్‌సభ ఎన్నికల వేళ జోరుగా జంపింగ్ జపాంగ్!

జంపింగ్ జపాంగ్.. జంపింగ్ జపాంగ్.. ఈ సాంగ్ ఎన్నికల వచ్చాయంటే ఎక్కువ ట్యూన్ అవ్వాల్సిందే. సీట్లు పాట్లు అంటూ నేతల అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. కండువాలు మార్చేందుకు కాఫీ తాగినంత టైం కూడా తీసుకోవడం లేదు. ఉదయం ఓ పార్టీలో ప్రచారం చేసి మధ్యాహ్నానికి మరో పార్టీలో దర్శనమిచ్చారు కంటోన్మెంట్ నేత.

'ఈ పొద్దు ఈ పార్టీ.. ఆ పొద్దు మరో పార్టీ'.. లోక్‌సభ ఎన్నికల వేళ జోరుగా జంపింగ్ జపాంగ్!
Brs Bjp Congress
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 22, 2024 | 1:37 PM

జంపింగ్ జపాంగ్.. జంపింగ్ జపాంగ్.. ఈ సాంగ్ ఎన్నికల వచ్చాయంటే ఎక్కువ ట్యూన్ అవ్వాల్సిందే. సీట్లు పాట్లు అంటూ నేతల అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. కండువాలు మార్చేందుకు కాఫీ తాగినంత టైం కూడా తీసుకోవడం లేదు. ఉదయం ఓ పార్టీలో ప్రచారం చేసి మధ్యాహ్నానికి మరో పార్టీలో దర్శనమిచ్చారు కంటోన్మెంట్ నేత. పార్టీ మార్పు ప్రచారాన్ని రాత్రి ఖండించి పొద్దున్నే కాంగ్రెస్ కండువ కప్పేసుకున్నారు ఖైరతాబాద్ దానం. ఎన్నికల వేళ రాజకీయ వలస పక్షులు సీటు ఖరారు చేసుకొని పార్టీలు మారుతున్నాయి. కాదేది అనర్హం అని కార్పొరేటర్ నుంచి సిట్టింగ్ ఎంపీ దాక పార్టీ ఫిరాయింపు పరిపాటిగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడి.. రాజకీయ వలస పక్షులను పసిగట్టి పార్లమెంట్ స్థానాల అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. ఇంతకీ ఎవరా రాజకీయ వలస పక్షులు ? జంపింగ్ జపాంగ్ లకు లోక్ సభ ఎన్నికలు కలిసివస్తాయా..?

లోక్ సభ ఎన్నికల వేళ నేతల పార్టీలు మార్పు పుల్ స్వింగ్ లో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ అంటే.. బిజెపి ఆపరేషన్ లోటస్ అంటూ సీట్ల హామీతో ఇతర పార్టీ నేతలకు స్వాగతం పలుకుతున్నాయి. కాంగ్రెస్ కండువా వేసుకునేందుకు కాఫీ తాగీనంత టైం కూడా తీసుకోట్లేదు నేతలు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆహ్వానిస్తే రెక్కలు కట్టుకువాలిపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సత్తాచాటాలని గట్టిపట్టుదలతో ఉన్న రేవంత్ టీమ్.. చేరికలకు లేదు అడ్డు గేట్లు తెరిచాం అంటూ స్వయంగా ప్రకటించారు. అధిష్టానానికి మెజార్టీ సీట్లు సాధించి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పొలిటికల్ స్ట్రాటజిక్ గా వెళ్తున్నారు. సర్వేల ఆధారంగా జనబలం, ఆర్థిక బలం ఆధారంగా టికెట్లను కేటాయిస్తున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో… దీపాదాస్ మున్షీ… కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేశారు. ఇక సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, నేతకాని వెంకటేశ్ లు కాంగ్రెస్ లో చేరిపోయారు. అంతకుముందే వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. వీరిలో సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ కు, చేవెళ్ల కు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి, మల్కాజిగిరి నుంచి సునీతామహేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్లు కన్ఫర్మ్ చేసింది. కొత్తగా చేరిన నేతలకు టికెట్ల కేటాయింపు చేయడంపై కాంగ్రెస్ లో మరోవర్గం భగ్గుమంటుంది. ఇది క్యాడర్ ను అవమానించడమేనని పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేరికల పట్ల స్థానికల నేతల నుంచి కొంత అసంతృప్తి రావడం సర్వసాధారణమే అంటోంది హస్తం పార్టీ

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ లోక్ సభ టికెట్లకు ఈసారి మంచి డిమాండ్ ఏర్పడింది. బిఆర్ఎస్ నుంచి నేతలు క్యూ కట్టారు. అలా పార్టీలో చేరి.. ఇలా టికెట్లను అందుకొని వెళ్లడంపై బీజేపీ పాత నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్.. టికెట్ల ప్రకటనకు ముందు రోజే కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు కండువా కప్పుకున్న 24 గంటల్లోనే.. తన కొడుకు భరత్ కు బీజేపీ టికెట్ ఇప్పించుకున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేశ్, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాంనాయక్ ఇటీవలే పార్టీలో చేరి బీజేపీ నుంచి పోటీ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అదే తరహాలో టికెట్ ఎగురేసుకెళ్లారు. వరంగల్, ఖమ్మం స్థానాల్లో కూడా కొత్త నేతలకే లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. వరంగల్ నుంచి ఆరూరి రమేశ్, ఖమ్మం నుంచి జలగం వెంకట్ రావు కే బీజేపీ టికెట్లు దక్కే ఛాన్స్ ఉంది. మొత్తంగా పాత క్యాడర్ కొత్త నేతలకు ఏ మేరకు సహకరిస్తుందనేది చూడాలి. టికెట్లు దక్కించుకున్న నేతలు… పాత బీజేపీ నేతలను కలవడానికి ప్రయత్నించినా… టైం ఇవ్వడం లేదట. వలస నేతలకే ప్రయార్టీ ఇవ్వడం పాత బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

పవర్ పాలిటిక్స్ కు అలవాటు పడిన నేతలు వై నాట్ బెటర్ వే అంటూ పక్కచూపులు చూస్తూనే ఉంటారు. పార్టీలు సైతం పవర్ ఫుల్ లీడర్ కావాలి ఎక్కడి నుంచి వచ్చినా సరే అంటూ పచ్చాజెండా ఊపి పార్టీలో చేర్చుకుంటున్నాయి. ఈ జంపింగ్.. జపాంగ్ లు ఇప్పటికైనా చేరిన పార్టీల్లో స్థిరంగా ఉంటారా ? మళ్లీ ఎన్నికలు అయిపోగానే మరోదారి చూస్తారా అంటే వేచి చూడాల్సిందే..