Poonch Terror Attack: పూంచ్‌లో IAF కాన్వాయ్‌పై తీవ్రవాద దాడి.. జవాన్ మృతి, మరో నలుగురికి సీరియస్

శనివారం (మే 5) జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు వికృత చర్యకు పాల్పడ్డారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఒక వైమానిక దళ సైనికుడు వీరమరణం పొందగా, మరో నలుగురు గాయపడ్డారు. పూంచ్‌లో జరిగిన దాడిలో 'పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌' (పీఏఎఫ్‌ఎఫ్‌) కు టెర్రరిస్టులు పాల్గొన్నట్లు వెలుగులోకి వస్తోంది.

Poonch Terror Attack: పూంచ్‌లో IAF కాన్వాయ్‌పై తీవ్రవాద దాడి.. జవాన్ మృతి, మరో నలుగురికి సీరియస్
Poonch Terrorist Attack
Follow us

|

Updated on: May 05, 2024 | 10:08 AM

శనివారం (మే 5) జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు వికృత చర్యకు పాల్పడ్డారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఒక వైమానిక దళ సైనికుడు వీరమరణం పొందగా, మరో నలుగురు గాయపడ్డారు. పూంచ్‌లో జరిగిన దాడిలో ‘పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌’ (పీఏఎఫ్‌ఎఫ్‌) కు టెర్రరిస్టులు పాల్గొన్నట్లు వెలుగులోకి వస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో ముడిపడి ఉంది. గత ఏడాది కూడా PAFF ఇలాంటి దాడి చేసింది.

మరో మూడు వారాల్లో అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనున్న తరుణంలో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఆదివారం (మే 5) ఉదయం నుంచి పూంచ్ అడవుల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు కొనసాగిస్తున్నారు. భారత సైన్యం అదనపు బలగాలు శనివారం అర్థరాత్రి పూంచ్‌లోని జర్రా వాలి గలికి చేరుకున్నాయి. ఉగ్రవాదుల కోసం ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి.

దాడి అనంతరం కాన్వాయ్‌కు భద్రత కల్పించినట్లు భారత వైమానిక దళం తెలిపింది. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళం ఎదురు కాల్పులు జరిపిందని వైమానిక దళం తెలిపింది. ఈ సమయంలో, ఐదుగురు సైనికులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓ ఎయిర్‌మన్‌ వీరమరణం పొందారు. అదే సమయంలో, పూంచ్‌లో ఈ ఉగ్రవాద దాడి తరువాత, PAFF మరోసారి వార్తల్లోకి వచ్చింది.

పూంచ్‌లో భయంకరమైన దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ గత సంవత్సరం కూడా అదే చేసింది. వైమానిక దళం కాన్వాయ్‌పై దాడి జరిగిన తర్వాత, గత ఏడాది డిసెంబర్ 21న సమీపంలోని బుఫ్లియాజ్‌లో సైనికులను మెరుపుదాడి చేసిన అదే ఉగ్రవాదుల బృందం ప్రమేయం ఉందని అధికారులు అనుమానించారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. PAFF ఉగ్రవాది మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్-ఎ-మహ్మద్‌తో సంబంధం ఉన్న సంస్థ. లోయలో తరచూ ఉగ్రదాడులకు పాల్పడుతోంది. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించబడినప్పుడు, ఈ ఉగ్రవాద సంస్థ వెలుగులోకి వచ్చింది. ఇటీవలి కాలంలో, జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలు, పౌరులపై జరిగిన చాలా ఉగ్రవాద దాడులకు PAFF బాధ్యత వహిస్తుంది.

టెర్రరిస్టు దాడులు చేస్తున్నప్పుడు PAFF బాడీ కెమెరాలను ఉపయోగిస్తుంది. ఆ తర్వాత వీడియో విడుదల చేస్తూ ప్రచారం జరుగుతోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 35 ప్రకారం PAFFని ఉగ్రవాద సంస్థగా హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఉగ్రవాద సంస్థ గత కొన్నేళ్లుగా లోయలోని చాలా మంది నాయకులను, కార్యకర్తలను చంపేస్తామని బెదిరించింది.

గత ఏడాది డిసెంబర్ 21న ఆర్మీ కాన్వాయ్‌పై PAFF దాడి చేసింది. సైనికులు ఆర్మీ వాహనంలో సెర్చ్ ఆపరేషన్ కోసం వెళుతుండగా, సురన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధేరా కి గాలి, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మలుపు వద్ద ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు సైనికులు గాయపడ్డారు.

గతేడాది ఏప్రిల్ 20న పూంచ్ జిల్లాలోని మెంధార్ తహసీల్‌లోని భట్టా దురియన్ ప్రాంతంలో PAFF ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడి చేశారు. ఈ దాడిలో, ఆర్మీ వాహనం మంటల్లో చిక్కుకుంది. ఇందులో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. ఒక సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన 2.5 నిమిషాల వీడియోను విడుదల చేయడం ద్వారా PAFF దాడికి బాధ్యత వహించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…