బైక్‎పై టిఫిన్ సెంటర్.. టేస్ట్ అదుర్స్ అంటున్న స్థానికులు..

ఇప్పటి వరకు మనం పెద్ద ట్రాలీ ఆటోలను మొబైల్ టిఫిన్ సెంటర్‎లుగా నడుపుతున్న వారిని చూశాం. రోడ్డు పక్కన ఇబ్బడి ముబ్బడిగా ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉపాధి కోసం ఖమ్మం‎కు చెందిన ఓ యువకుడు కొంచెం డిఫరెంట్‎గా ఆలోచించి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. మొన్నటి వరకూ మారుతీ కారులో జిరాక్స్ సెంటర్ ప్రారంభించి షాక్ ఇచ్చాడు ఒక యువకుడు. ప్రస్తుతం అతని బాటలోనే ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ ఖమ్మం జిల్లాకు చెందిన సతీష్ అనే యువకుడు. తన పాత పల్సర్ బైక్‎ను మొబైల్ టిఫిన్ సెంటర్‎గా మార్చాడు.

బైక్‎పై టిఫిన్ సెంటర్.. టేస్ట్ అదుర్స్ అంటున్న స్థానికులు..
Two Wheeler Mobile Canteen

Edited By: Srikar T

Updated on: Mar 13, 2024 | 11:42 AM

ఇప్పటి వరకు మనం పెద్ద ట్రాలీ ఆటోలను మొబైల్ టిఫిన్ సెంటర్‎లుగా నడుపుతున్న వారిని చూశాం. రోడ్డు పక్కన ఇబ్బడి ముబ్బడిగా ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉపాధి కోసం ఖమ్మం‎కు చెందిన ఓ యువకుడు కొంచెం డిఫరెంట్‎గా ఆలోచించి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. మొన్నటి వరకూ మారుతీ కారులో జిరాక్స్ సెంటర్ ప్రారంభించి షాక్ ఇచ్చాడు ఒక యువకుడు. ప్రస్తుతం అతని బాటలోనే ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ ఖమ్మం జిల్లాకు చెందిన సతీష్ అనే యువకుడు. తన పాత పల్సర్ బైక్‎ను మొబైల్ టిఫిన్ సెంటర్‎గా మార్చాడు.

ప్రభుత్వ ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసి.. అది రాక పోవడంతో ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేశాడు సతీష్. అయినా తనకు కుటుంబ పోషణ కష్టంగా మారడంతో.. ఇక ఉద్యోగాల వేటకు స్వస్తి చెప్పి.. తన కాళ్ళ మీద తాను నిలబడేలా సొంతంగా ఏదయినా పని చేయాలను కున్నాడు. తన బైక్‎నే మొబైల్ టిఫిన్ సెంటర్‎గా మార్చుకున్నాడు. ఖమ్మం నగరంలోని ప్రధాన సెంటర్‎ల వద్ద బైక్‎ను నిలిపి ఖమ్మం వాసులకు రుచికరమైన టిఫిన్‎లు అందిస్తున్నాడు. ప్రతి రోజూ కష్ట పడుతూ.. తక్కువ ఖర్చుతో టిఫిన్ సెంటర్ ద్వారా కొంత ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ఎదురు చూడకుండా.. ఏదో ఒకటి చేసి కుటుంబానికి ఆసరాగా నిలబడాలని నిరుద్యోగ యువతకు సూచిస్తున్నాడు. ఇతని ఆలోచనకు స్థానికులు అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..