Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Road Accident: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, ఓవర్‌టెక్‌, మద్యం తాగి వాహనాలు నడపడం ఇలా రకరకాల కారణాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలతో ఎందరో అమాయకులు బలయవుతున్నారు.

Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Sangareddy Road Accident

Edited By:

Updated on: Aug 12, 2026 | 12:21 PM

Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. eటోను ఢీకొన్న ట్యాంకర్‌ ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమం ఉండటంతో క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదం మొగడంపల్లి మండలం సత్వార్‌ దగ్గర చోటు చేసుకుంది. మృతులు కర్నాటకలోని రాజగిరి వాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే మృతులు అంతా కూలీలుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 14 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రతి రోజు ఇలాంటి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు జరుగకుండా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, ఓవర్‌టెక్‌, మద్యం తాగి వాహనాలు నడపడం ఇలా రకరకాల కారణాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలతో ఎందరో అమాయకులు బలయవుతున్నారు.

మరో ప్రమాదంలో ఇద్దరు మృతి

అలాగే మరో రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. కోహిర్‌ మండలం కవేలిలో వాహహనాలపై ఓ కారు దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బీదర్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇలా వేర్వేరు ప్రమాదంలో మొత్తం 9 మంది మృతి చెందారు. దీంతో సంగారెడ్డి జిల్లాలో రహదారులు రక్తసిక్తంగా మారాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us