Food Poisoning: స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రులకు తరలింపు!

Sangareddy Food Poisoning News: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి ZP హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. భోజనం చేసిన తర్వాత సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పలువురిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Food Poisoning: స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రులకు తరలింపు!
Sangareddy Food Poisoning

Edited By:

Updated on: Sep 17, 2026 | 10:07 PM

Sangareddy Food Poisoning: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి ZP హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ వెంకటేష్ ఇంట్లో నిన్న జరిగిన ఓ ఫంక్షన్‌లో మిగిలిన ఆహారాన్ని మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులకు పెట్టినట్లు సమాచారం. భోజనం చేసిన అనంతరం సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.విద్యార్థులతో పాటు వైస్ ప్రిన్సిపాల్ వెంకటేష్ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరో 15 మంది విద్యార్థులకు సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో ఐదుగురు విద్యార్థులను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..ఘటన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. విద్యార్థులకు ఏ ఆహారం పెట్టారు? ఆహారం నాణ్యతను పరిశీలించారా? ఘటనకు అసలు కారణమేంటి? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.

వీడియో చూడండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us