Karimnagar: ‘అయ్యో పాపం.. ఎంత కష్టం వచ్చింది?’ రేపు ఆర్టీసీ బస్టాండ్లో కోడిపుంజు వేలం

|

Jan 11, 2024 | 4:56 PM

కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. గత 4 రోజులుగా కరీంనగర్ బస్టాండ్ డిపో 2లో ఓ కోడి పుంజు బందీగా ఉన్న సంగతి తెలిసిందే. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ కోడి పుంజును ఓ ప్రయాణికుడు మరిచిపోయి వెళ్లిపోయాడు. బస్సు దిగేసమయంలో ప్రయాణికుడు కోడి పుంజును మర్చిపోయినట్లు తెలుస్తోంది. దీంతో కరీంనగర్ బస్టాండ్‌కు చేరుకోగానే బస్సులోని సంచిలో కోడిపుంజు..

Karimnagar: అయ్యో పాపం.. ఎంత కష్టం వచ్చింది? రేపు ఆర్టీసీ బస్టాండ్లో కోడిపుంజు వేలం
Rooster Auction At Karimnagar Rtc Bus Depot
Follow us on

వేములవాడ, జనవరి 11: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. గత 4 రోజులుగా కరీంనగర్ బస్టాండ్ డిపో 2లో ఓ కోడి పుంజు బందీగా ఉన్న సంగతి తెలిసిందే. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ కోడి పుంజును ఓ ప్రయాణికుడు మరిచిపోయి వెళ్లిపోయాడు. బస్సు దిగేసమయంలో ప్రయాణికుడు కోడి పుంజును మర్చిపోయినట్లు తెలుస్తోంది. దీంతో కరీంనగర్ బస్టాండ్‌కు చేరుకోగానే బస్సులోని సంచిలో కోడిపుంజు ఉండటం బస్సు డ్రైవర్ గుర్తించాడు. సంచిలో ఉన్న కోడిపుంజును కంట్రోల్‌కు అప్పగించాడు. అప్పటినుంచి ఆ పందెంకోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోనే తాడుతో కట్టి ఆర్టీసీ 2 డిపో అధికారులు సంరక్షిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఓ జాలీలో పుంజును ఉంచి దాని ఆలనాపాలనా చూసుకుంటున్నారు. కోడి సుమారు 6 కేజీల వరకు ఉంటుందని ఆర్టీసీ డిపోఅధికారులు అంటున్నారు.

కోడిపుంజు కోసం ఎవరైనా వస్తారని గత నాలుగు రోజులుగా అధికారులు ఎదురు చూస్తున్నారు. కానీ పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. పుంజును వేలం వేసి విక్రాయించాలని భావించారు. ఈ మేరకు ఓ ప్రకటన వెలువరించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజును బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు సదరు ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం అంబేద్కర్ బస్టాండ్ ఆవరణలో కరీంనగర్ -2 డిపో పరిధిలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు బహిరంగ వేలంలో పాల్గొని, పుంజును సొంతం చేసుకోవచ్చని ప్రకటించారు. దీంతో ఈ కోడిపుంజు వేలంకి సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.