Video: అమ్మో.. జర్రుంటే కొండచిలువ చుట్టేసేది.! ధైర్యమున్నోళ్లే వీడియో చూడండి

రాక్ పైథాన్ స్థానికంగా కలకలం రేపింది. వరద నీటికి జనావాసాల్లోకి వచ్చిన ఈ పైథాన్.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

Video: అమ్మో.. జర్రుంటే కొండచిలువ చుట్టేసేది.! ధైర్యమున్నోళ్లే వీడియో చూడండి
Viral

Updated on: Oct 01, 2025 | 12:35 PM

హైదరాబాద్‌ నగరంలోని సిటీ కాలేజ్ సమీప హుస్సైనీ ఆలం పోలీస్‌ లిమిట్స్‌లో ఒక భారీ రాక్ పైథాన్ స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న జంతు సంక్షేమ కార్యకర్త సయ్యద్ తాకీ అలీ రిజ్వీ రక్షణ చర్యలు చేపట్టారు. రాక్ పైథాన్‌ను సురక్షితంగా పట్టుకుని, దానికి ఎలాంటి గాయం జరగకుండా జాగ్రత్త వహించారు. అనంతరం అటవీశాఖ అధికారులను సంప్రదించి, ఆ పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నారు.

ఇది చదవండి: అక్కడెలా పెట్టుకున్నావురా.. 10 ఏళ్ల బాలుడికి ఎక్స్‌రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు

తాజాగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పాములు, సరీసృపాలు, ఇతర అడవి జంతువులు నివాస ప్రాంతాల్లోకి చుట్టపు చూపుగా వస్తున్నాయి. ‘వరదల కారణంగా మీ ఇళ్లల్లో, కాలనీల్లో లేదా రోడ్లపై ఏవైనా అడవి జంతువులు లేదా పాములు కనిపించినా భయపడకుండా, వాటికి హాని చేయకుండా వెంటనే సమాచారం ఇవ్వండి. మేము వాటిని రక్షించి, సురక్షిత ప్రదేశాలకు తరలిస్తాం’ అని జంతు సంక్షేమ కార్యకర్త అన్నారు. కాగా, రక్షించబడ్డ రాక్ పైథాన్ పూర్తిగా ఆరోగ్యంగా ఉందని జంతు సంరక్షణ సిబ్బంది తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: దండిగా చేపలు పడదామని బోట్‌లో వెళ్లాడు.. నీటి అడుగున కనిపించింది చూడగా