Telangana: సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దంపతులు సహా ఒక కూతురు చనిపోగా.. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోదాడ పట్టణంలోని గుడిబండ బైపాస్ ఫ్లై ఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్తుండగా.. వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. దాంతో వారంతా బైక్‌తో సహా ఎగిరి బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయారు. ఈ ఘటనలో దంపతులిద్దరు, ఒక పాప చనిపోగా.. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రిలో చేర్పించగా.. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులు కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన భార్య భర్తలు బొయ్యాల శ్రీనివాస్, నాగమణి ముగ్గురు పిల్లలుగా గుర్తించారు పోలీసులు. కాగా, ఈ రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అటుగా వెళ్తున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన ఆయన.. వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Also read:
Telangana: గుజరాత్‌కు రూ.21 వేల కోట్లు, మరి తెలంగాణకేవి?.. కేంద్రంపై ఫైర్ అయిన వినోద్ కుమార్..
TTD: శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పిన టీటీడీ.. ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు..
YSRCP Politics: సీఎం జగన్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా? ఆ జిల్లా రాజకీయాలు ఏ టర్న్ తీసుకోబోతున్నాయి..!