సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టి బోల్తా పడ్డ టిప్పర్‌.. 18 మందికి గాయాలు

|

Apr 09, 2021 | 9:09 PM

Road Accident: సిద్ధిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన టిప్పర్‌ బోల్తా పడటంతో 18 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గజ్వేల్‌ పట్టణ శివారులో చోటు

సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టి బోల్తా పడ్డ టిప్పర్‌.. 18 మందికి గాయాలు
Road Accident
Follow us on

Road Accident: సిద్ధిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన టిప్పర్‌ బోల్తా పడటంతో 18 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గజ్వేల్‌ పట్టణ శివారులో చోటు చేసుకుంది. అయితే టిప్పర్‌లో మొత్తం 21 మంది కూలీలు ప్రయాణిస్తుండగా, అందులో 18 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, మల్లన్నసాగర్‌ దాసారం కాలువలో పనులు చేస్తున్న కూలీలు.. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా మహబూబ్‌నగర్‌కు చెందిన కూలీలుగా తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

కాగా, ఇలా రోజురోజుకు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఇవీ చదవండి: Texas Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. పోలీసుల అదుపులో నిందితుడు.. వరుస కాల్పులతో ఆందోళన

Coronavirus: ఫస్ట్‌వేవ్‌లో కేసులు తీవ్ర స్థాయికి చేరేందుకు ఏడు నెలలు పడితే.. సెకండ్‌ వేవ్‌లో రెండు నెలలే : WHO

Indian Techie: అమెరికాలో విషాదం.. భారతీయ దంపతుల అనుమానస్పద మృతి.. అనాథగా మారిన నాలుగేళ్ల చిన్నారి