
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ తీపి కబురు అందించింది. జనవరి నెల పెండింగ్ బిల్లులకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ బిల్లుల కోసం రూ.720 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ క్లియర్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక ప్రభుత్వ ఉద్యోగులందరికీ గ్రాట్యుటీ జిపిఎఫ్ సరెండర్ లీవ్ అడ్వాన్సులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల హామీల అమలులో ప్రజా ప్రభుత్వం వేగం పెంచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రతి నెల రూ.700 కోట్లకు పైగా విడుదల హామీ కొనసాగించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ నిధుల కోసం ఉద్యోగులు ఎప్పటినుంచో వేచి చూస్తున్నారు. వీటిని విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. పెండింగ్ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. సరెండ్ లీవులు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు నిధులు విడుదల చేయడం గమనార్హం.
కేంద్ర బడ్జెట్ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బిల్లులు క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు నిధులు కేటాయించాలనే ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అలాగే అనేకసార్లు ప్రతిపాదనలు కూడా పంపింది. దీంతో మెట్రోకు నిధులు కేటాయించే అవకాశముందనే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. అటు రాష్ట్రంలో వివిధ రోడ్ల అభివృద్ది, ఇతర ప్రాజెక్టులకు నిధులు వస్తాయోమనని భావిస్తోంది. గత రెండు బడ్జెట్‌లలో తెలంగాణకు నిరాశై ఎదురైంది. దీంతో ఈ సారైనా బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు ఉంటాయోమనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి బడ్జెట్ ప్రతిపాదనలు పంపింది. అయితే తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో.. ఈ సారి తెలంగాణకు కేటాయింపులు ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.