
తెలంగాణలోని ఎస్సీ గురుకుల సొసైటీలో చదువుతున్న విద్యార్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపేందుకు గత డిసెంబర్‌లో పది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులోని నిరంతరం ఇద్దరు డాక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు అందుబాటులో ఉంటారు. వీరు ప్రతి రోజూ ఉదయం 8గంటలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సోసైటీలలోని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకుంటారు. ఇప్పటికే ఈ కేంద్రం ద్వారా సుమారు 197 మందికి పైగా విద్యార్థులకు తీవ్రమైన వ్యాధులు ఉన్నట్లు గుర్తించారు. వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు అవసరాన్ని భట్టి ఖరీదైన వైద్యం చేయించేందుకు సైతం ప్రభుత్వం ప్రాణాళికలు రచిస్తోంది
ఈ హెల్త్ కమాండ్ సెంటర్ గడిచిన 3 నెలల్లో 4,879 మంది విద్యార్థులు సాధారణ జ్వరాల ద్వారా బాధపడుతున్నారని గుర్తించింది. వీరికి స్కూల్‌లోనే వైద్యం అందించి నయం చేసింది. మరో 280 మంది విద్యార్థులను హాస్పిటల్‌కు పంపింది. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సుమారు 197 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అలాగే ఈ మధ్య ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారికి తక్షణమే వైద్యం అందించేందుకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్సలకు సిఫార్సు చేస్తున్నారు.
ఇప్పటికే విద్యార్థులకు చికిత్సలు
ఈ కమాండ్ హెల్త్ సెంటర్ ఇప్పటికే అనారోగ్యానికి గురైన గురుకులాల్లోని విద్యార్థులకు మెరుగైన వైద్యాన్ని అందింస్తోంది. ఖమ్మం జిల్లా మధిర బాలికల గురుకుల స్కూల్‌లో ఓ విద్యార్థిని భవనంపై నుంచి పడి వెన్నుముకకు గాయం కావడంతో సొసైటీ హెల్త్ సభ్యులు విద్యార్థిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న మరో విద్యార్థికి సైతం ఖరీదైన ఇంజెక్షన్లతో వైద్యం కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.