AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. బీ కేర్‌ఫుల్.! వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఇక ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దవుతోంది. ఏకదాటి వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. మరి ఏపీ, తెలంగాణలో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దామా.. ఓ సారి లుక్కేయండి మరి.

Telangana: ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. బీ కేర్‌ఫుల్.! వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
Rain Alert
Ravi Kiran
|

Updated on: Jul 24, 2025 | 7:52 AM

Share

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 9 జిల్లాలకు ఆరెంజ్‌, 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో 20 సెంటిమీటర్లకుపైగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ తెలిపింది. కరీంనగర్‌, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతో పాటు.. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. కుండపోత వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగుతున్నాయ్.

ఇక బుధవారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కుమ్మేసిన వర్షంతో సిటీ జలమయమైంది. నగరంలోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, హైదర్‌నగర్, హఫీజ్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, మియాపూర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, బేగంపేట, పంజాగుట్ట, అల్వాల్, సరూర్‌నగర్ దిల్‍సుఖ్‍నగర్, హయాత్‌నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

మరోవైపు ఏపీలో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు.. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69మిమీ, నర్సన్నపేటలో 62.5మిమీ, కోటబొమ్మాళిలో 53.2మిమీ, మందసలో 48.7మిమీ, రాజాపురంలో 46.2మిమీ, వజ్రపుకొత్తూరులో 40.7మిమీ వర్షపాతం ననమోదైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..